- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుక్స్ చూస్తే జంకుతున్న Gen-Z.. 95% ముట్టుకుంటే ఒట్టు!
ఈ తరం యువత (Gen-Z)లో బుక్ రీడింగ్ అలవాటు తగ్గిపోయింది. 18–29ఏళ్లవారు 5శాతమే బుక్స్ చదువుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.

దిశ, ఫీచర్స్: ‘పుస్తకం హస్త భూషణం.. మస్తిష్క మధనానికి సరియైన సాధనం. మదనపడే మదికి దివ్య ఔషధం అన్నారు’ ఒక కవి. ఎందుకంటే మానవుల్లో అజ్ఞానమనే చీకటిని తొలగించే దీపాలే పుస్తకాలు. అలాంటి అజ్ఞాన తిమిరాన్ని తరిమే పుస్తక పఠనం ఇప్పుడు కనుమరుగైపోతోంది. ముఖ్యంగా ఈ తరం యువత (Generation Z)లో బుక్ రీడింగ్ అలవాటు గణనీయంగా తగ్గిపోయింది. పుస్తకాలు చదివే ఓపిక, తీరిక ఎవరికీ ఉండకపోగా కనీసం డిజిటల్‌గా లభించే కథలు, నవలలు కూడా ఒక్కసారైనా చదివే సాహసం చేస్తున్న ధాఖలాలు కనిపించట్లేదు. అయితే దీనిపై టెక్నాలజీ ఎఫెక్ట్ ఉంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్, ఇతర వేదికల్లో తక్షణ ఆనందానికి అలవాటు పడిన యువతరం.. రీల్స్, షార్ట్ వీడియోలకే మొగ్గు చూపుతున్నారు. కేవలం 30 సెకన్లలో లభించే ఫన్ కోసం తహతహలాడే మనస్తత్వానికి అలవాటు పడి.. కొన్ని గంటలపాటు కూర్చొని బుక్ రీడింగ్ చేయడం ఒక టార్చర్‌లా ఫీల్ అవుతున్నారు. దీనివల్ల యూత్‌లో ఏకాగ్రత గణనీయంగా తగ్గిపోతోందని, భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు, ప్రొఫెసర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
షార్ట్ కట్:
సాంకేతిక పరిజ్ఞానం పెరగటం, సమాచారం కోసం AI వంటి సులభమైన పద్ధతుల కారణంగా ఈ తరం విద్యార్థులు, యువత లోతైన అంశాలను విశ్లేషణ చేసేందుకు ఇష్టపడట్లేదు. నెమ్మదిగా లైన్ బై లైన్ చూడకుండా కేవలం తమకు కావాల్సిన సమాచారాన్ని కోసం పఠనాన్ని పరిగెత్తిస్తున్నారని, పాఠాలు, కథలు, నవలలు, రచనలపై సుధీర్ఘమైన పరిశోధన చేయలేకపోతున్నారని పలువురు టీచర్లు చెబుతున్నారు. రచయిత ఏం చెప్పారో, ఆ సారాంశం అంతరార్థం ఏమిటో కూడా గ్రహించలేకపోతున్నారని, క్లిష్టమైన వాక్య నిర్మాణానాలను అర్థం చేసుకోవడాన్ని కష్టంగా ఫీల్ అవుతున్నారని గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటి జనరేషన్ విద్యార్థుల పఠన నైపుణ్యాలు బలహీనంగా ఉంటున్నాయని, పాఠ్యాంశ సారాంశం తెలియకుండానే డిగ్రీపట్టాలు అందుకోవడం నిజంగా బాధకరమని, ఇది విద్యా వ్యవస్థకు మంచిదికాదని అధ్యాపకులు హెచ్చరిస్తున్నారు.
డిజిటల్ డిస్ట్రబెన్స్:
ప్రస్తుతం పుస్తకాల్లో అక్షరాలను చూడటం కంటే స్ర్కీన్లను చూసేందుకే బ్రెయిన్ అలవాటు పడిపోతోంది. దీనివల్ల మొదడులో విశ్లేషణాత్మకమైన భావాలకంటే ఎమోషనల్ ఫీలింగ్స్ ఉత్తేజితమవుతున్నాయని ప్రొఫెసర్లు చెబుతున్నారు. కొంతమంది బుక్ రీడింగ్ చేస్తున్నా సరే.. పక్కన మొబైల్, ట్యాబ్ పెట్టుకోవడం వల్ల అందులో వచ్చే నోటిఫికేషన్లు కాంన్సట్రేషన్‌ను దెబ్బతీస్తున్నాయని, దీనివల్ల కూడా విద్యార్థుల్లో మేధోపరమైన పరిణితి, భాషా నైపుణ్యం తగ్గిపోతుందంటున్నారు. డిజిటల్ కంటెంట్ కారణంగా కొత్త పదాలు, వ్యాకరణంపై పట్టుకోల్పోవడం, విమర్శనాత్మక ఆలోచన లోపించడం, ఒక విషయాన్ని పలు కోణాల్లో విశ్లేషించే శక్తి లేకపోవడం, సహనం కోల్పోవడం, సుదీర్ఘమైన పనులను పట్టుదలతో పూర్తి చేసే ఆసక్తి మందగించడం జరుగుతున్నాయని ఇప్పటికే పలు సర్వేల్లో వెల్లడైనట్లు నిపుణులు పేర్కొన్నారు.
జెన్‌జీ 5శాతమే:
‘గడిచిన పదేళ్లలో బుక్ రీడింగ్ అలవాటు 40% తగ్గింది. 2025లో దాదాపు సగం మందికిపైగా అమెరికన్లు ఒక్క పుస్తకం తెరవలేదు. ముఖ్యంగా 18–29 సంవత్సరాల వయస్సు గల అమెరికన్లు సగటున 5.8 బుక్స్ మాత్రమే కంప్లీట్ చేశారు. జనరేషన్ జెడ్ ఇందులో చాలా వెనుకబడి ఉంది. కొంతమంది విద్యార్థులు తరగతి గదిలో ఒక్క వాక్యం కూడా చదవడానికి ఇష్టపడరు. విమర్శనాత్మక చర్చలో పాల్గొనడానికి ఇబ్బంది పడుతున్నారు. 50% మంది అయిష్టంగా చదివేవారుగా కనిపిస్తున్నారు’ అని కాలిఫోర్నియాలోని పెప్పర్‌డైన్ విశ్వవిద్యాలయం ఫ్రొఫెసర్ జెస్సికా హూటెన్ వివరించారు. ఈ క్రమంలోనే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, తాము పెద్ద పెద్ద పాఠ్యపుస్తకాలకు బదులుగా చిన్న చిన్న స్లైడ్స్ (PPTs) లేదా సమ్మరీ నోట్స్ ఇస్తున్నామని తెలిపారు. అయితే కొంతమంది పిల్లలను చదివేలా ప్రోత్సహించిన తర్వాత వారు మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించారని, పిల్లలను తమంతట తాముగా విమర్శనాత్మకంగా ఆలోచించగలిగేలా చేయడటమే పేరెంట్స్, టీచర్లు లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.






