Love Proposal : లవ్ ప్రపోజ్ చేయగానే ఎవరూ పడిపోరు బ్రో..! ఇంకేదో కావాలి!!

by Javid Pasha |

Love Proposal : లవ్ ప్రపోజ్ చేయగానే ఎవరూ పడిపోరు బ్రో..! ఇంకేదో కావాలి!!

Love Proposal : లవ్ ప్రపోజ్ చేయగానే ఎవరూ పడిపోరు బ్రో..! ఇంకేదో కావాలి!!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు నచ్చిన వ్యక్తికి ప్రపోజ్ చేస్తే లవ్‌లో పడిపోయే అవకాశం ఎక్కువగానే ఉండేదని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ‘నువ్వు అందంగా ఉన్నావనో, నువ్వే నా ప్రాణం అంటూనో పొగిడేస్తుంటే.. అవతలి వ్యక్తి అమ్మాయయైనా, అబ్బాయైనా తెగ సంబరపడిపోయేవారు. చాలా వరకు సానుకూలంగానే రిసీవ్ చేసుకునేవారు. అంటే పొగడ్తలకు దాదాపుగా పడిపోయేవారట. కానీ ఇప్పుడు? ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లవ్, డేటింగ్(Love, dating) వంటి విషయంలోఈతరం యువత (Generation Z ) చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తోంది. సర్వేల సైతం అదే పేర్కొంటున్నాయి.

దృక్పథం మారుతోంది

ఓ రెండేండ్ల క్రితం రవకు కూడా ఆన్‌లైన్ చాటింగ్‌లు(Online chatting), డేటింగ్‌(dating)లు, ముఖాలు చూసుకోకుండానే ప్రేమలో పడిపోవడాలు మస్తు జరిగినయ్.. కానీ ఇప్పుడా చాన్స్ లేకుండా పోతోందిక! ఎందుకంటే అనేక అనుభవాలు, మోసాలు, సోషల్ మీడియా వేదికలో వాటి గురించిన సమాచారం తెలుసుకోవడం వంటివి యువతలో మార్పునకు కారణం అవుతున్నాయి. ఇప్పుడంత ఈజీగా ఎవరినీ నమ్మడం లేదు. ముఖ్యంగా జెన్ జీ(Generation Z)లు ఆచి తూచి అడుగు వేస్తున్నారు. ప్రేమ సంబంధాల పట్ల వారి దృక్పథం మారుతోంది. ఇక్కడ సామాజిక, ఆర్థిక కోణాలు(Social and economic aspects) కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు

జెన్ జీ(Generation Z)లు ప్రేమ సంబంధాల పట్ల ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలు పెట్టారు. యువతీ యువకులు ఎవరైనా సరే ఒక వ్యక్తి ప్రేమ, పెళ్లి, డేటింగ్(Love, marriage, dating) వంటి విషయంలో ప్రపోజ్ చేయగా(Love Proposal)నే సిగ్గుతోనో, భయంతోనో పారిపోవడమో, ఒకే చెప్పడమో, తర్వాత చెబుతానని వాయిదా వేయడమో అస్సలు చేయడం లేదట. పైగా తమకు నచ్చితే సమయం తీసుకొని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. అవతలి వ్యక్తిలో కేవలం ప్రేమ ఒక్కటే కాదు, ఎమోషనల్ సపోర్ట్, ఆర్థిక స్థిరత్వం, కెరీర్ లక్ష్యాలు, జీవనశైలిలోని అనుకూలతలు వంటి అనేక విషయాలను ఈతరం పరిగణనలోకి తీసుకుంటోంది ఈ తరం యువత. తమకు తాము ఒక వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకుంటే లైఫ్‌లో అన్ని విధాలుగా సంతోషంగా ఉండగలమనే అంతర్గత నిర్ణయానికి వస్తేనే ప్రేమ, డేటింగ్, పెళ్లి వంటి వాటికి ఓకే చెప్పేస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో కచ్చితంగా ఉంటున్నారనేది సర్వేలు పేర్కొంటున్నాయి.

సర్వేలు ఏం చెబుతున్నాయి?

అంతెందుకు 2022లో OkCupid నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 70% మంది జెన్ జీ(Gen Z)లు తమ భాగస్వామి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరైనా లవ్ ప్రపోజల్ ముందుకు తెచ్చినా ఈ విషయంలో క్లారిటీ వచ్చాకే ఒకే చెప్పేస్తున్నారట. ఇక అప్పట్లో కేవలం విదేశాల్లోనే ఇలా ఆలోచించే యువతీ యువకులు ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు మన దేశంలోనూ అదే జరుగుతోంది. ప్రేమంటే మనసులో ఉంటే సరిపోతుందని చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు అనుకోవడం లేదు.

ఆర్థిక స్థిరత్వం ముఖ్యం

ప్రేమ, పెళ్లి అవసరమే. జీవితంలో అదొక భాగం. కానీ దాంతోపాటు ఇంకా చాలా కావాలంటోంది నేటి యువత. ఆర్థిక స్థిరత్వం, భావోద్వేగ మద్దతు, మంచి జీవితానికి అవసరమైన వనరులు ఇవన్నీ ఉండాలంటోంది. అలా ఉంటేనే లవ్, డేటింగ్, పెళ్లి వంటి వాటికి ఓకే చెప్పడానికి ఆసక్తి చూపుతోంది. అందుకే లైఫ్‌లో సెటిల్ అవ్వకుండానో, అవతలి వ్యక్తిని అర్థం చేసుకోకుండానే చేసే లవ్ ప్రపోజల్స్ ఈరోజుల్లో వృథా ప్రయాసే అంటున్నారు నిపుణులు. చివరికి అవి బాధను మిగల్చడం తప్ప దేనికీ పనికిరావని చెబుతున్నారు. ముందు మీ గురించి మీరు ఆలోచించండి. జీవితంలో ఆర్థికంగా స్థిరపడండి. ఆ తర్వాతే ప్రేమ గురించి ఆలోచించండి అంటున్నారు నిపుణులు.

Next Story