- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిలీనియల్స్‌కు భిన్నంగా జెన్‌జీ.. పనిలో విప్లవాత్మకమైన మార్పులు!
మిలీనియల్స్‌కు భిన్నంగా పనిలో Gen-Z విప్లవాత్మకమైన మార్పు కోరుకుంటోంది. పని కోసం బతకొద్దు బతకడం కోసమే పని చేయాలంటోంది.

దిశ, ఫీచర్స్: పనిలో Gen-Z విప్లవాత్మకమైన మార్పును కోరుకుంటోంది. వర్క్‌పై మిలీనియల్స్ కలిగివున్న దృక్పథానికి భిన్నంగా జెన్‌జీ రూల్స్‌ను సవాల్ చేస్తోంది. కార్పొరేట్ కంపెనీల్లో వర్క్ కల్చర్, అధిక పనిగంటలు, త్యాగం వంటి మిలీనియల్స్ బార్డర్స్‌ను బద్దలు కొడుతూ మెంటల్ హెల్త్‌కు ఇంపార్టెన్స్ ఇస్తోంది జెన్‌జీ. ఉద్యోగ విలువలకు రెస్పెక్ట్ ఇస్తూనే సెలవుల విషయంలో న్యాయమైన డిమాండ్లతో లైఫ్‌ను ఆస్వాదించేందుకు ఇంట్రెస్ట్ చూపుతోంది. పని కోసం బతకడం కాదు.. బతకడం కోసమే పని చేయాలనే నినాదాన్ని హైలెట్ చేస్తోంది.
క్వైట్ క్విట్టింగ్..
మిలీనియల్స్ కెరీర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పని కోసం జీవిస్తారు. కెరీర్ ఎదుగుదల, ప్రమోషన్లు, గుర్తింపు కోసం ఎంతైనా కష్టపడతారు. ఆఫీస్ పనులను ఇంటికి తీసుకెళ్లడానికి కూడా వెనకాడరు. విపరీతంగా కష్టపడటం, అదనపు గంటలు పనిచేయడాన్ని గ్రేట్‌గా ఫీల్ అవుతారు. కానీ ఈ తరం అలా లేదు. మిలీనియల్స్ కల్చర్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. బాస్ చెప్పిన పని మాత్రమే (Quiet Quitting)పూర్తి చేయాలని, ఉద్యోగం కోసం జీవితాన్ని బలిపెట్టకూడదనే ధోరణులు వీరిలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్లెక్సిబిలిటీ లేని వర్క్‌ను అస్సలు ఇష్టపడట్లేదు. కంపెనీ నిర్ధేశించిన 8 గంటలు ఆఫీసులోనే ఉండాలనే రూల్స్ ఫాలో కావడాన్ని కష్టంగా ఫీల్ అవుతోంది. వర్క్ ఎక్కడి నుంచి చేస్తున్నాం అనేది కాదు.. పని పూర్తయిందా లేదా అన్నదే ముఖ్యంగా భావిస్తోంది. నిరంతరం మెంటల్ హెల్త్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే జెన్‌జీ.. హైబ్రిడ్, రిమోట్ వర్క్ ఆప్షన్ లేని కంపెనీల్లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని రీసెంట్ సర్వేల్లో వెల్లడైంది.
ముక్కుసూటిగానే..
ప్రొఫెషనల్, మర్యాదగా ఉండే సంభాషణలను మిలీనియల్స్ ఇష్టపడతారు. ఫీడ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తారు. అది నెలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి ఉన్నా అడ్జస్ట్ అవుతారు. కానీ జెన్‌జీ పని విషయంలో ముక్కుసూటిగా ఉండటానికి ఇష్టపడతారు. వీరికి నిరంతరం ఫీడ్‌బ్యాక్ (Instant feedback) కావాలి. ఆఫీస్ పాలిటిక్స్ కంటే Transparency ఉంటేనే ఆ సంస్థలో కొనసాగేందుకు ఆసక్తి చూపుతారు. డిజిటల్ యుగంలో జన్మించిన వారంతా హైస్పీడ్ ఇంటర్నెట్ వలే వీడియో కమ్యూనికేషన్, వెంటనే రిజల్ట్స్ ఇచ్చే టూల్స్‌ను ఇష్టపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
సోషల్ రెస్పాన్సిబిలిటీ..
సామాజిక బాధ్యతలోనూ జెన్‌జీ ముందుండటం గమనార్హం. పర్యావరణం, సామాజిక న్యాయం, వైవిధ్యం (Diversity) పట్ల కంపెనీ వైఖరి ఏంటో వెంటనే గుర్తించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ విలువలకు సరిపోని కంపెనీలను నిర్మొహమాటంగా వదిలేస్తున్నారు. శాలరీల విషయంలోనూ మూస పద్ధతులను Gen Z బద్దలు కొడుతోంది. తమ తోటి ఉద్యోగులతో జీతాల గురించి చర్చించడానికి వెనుకాడట్లేదు. తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకునే ధోరణిని మొహంపైనే ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా మిలినీయల్స్ ఫైనాన్సియల్ సెక్యూరిటీ లక్ష్యంతో పనిచేస్తే జెన్‌జీ మాత్రం ఫ్రొఫెషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్‌తో జీవిస్తున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే కుటుంబ నేపథ్యం, పెరిగిన పరిస్థితులు, ఆర్థిక స్థోమత ఆధారంగా కొంతమందిలో మార్పులుంటున్నట్లు పేర్కొన్నారు.






