ఖరీదైన వస్తువులు కాదు.. అందమైన జ్ఞాపకాలే ముఖ్యం!

by Javid Pasha |   (  Updated:2026-04-15 10:09:07  IST  )

జెన్‌-Z ఇప్పుడు ఖరీదైన భౌతిక వస్తువుల కొనుగోలు కంటే.. గుర్తుండిపోయే జ్ఞాపకాలనే ఎక్కువ ఇష్టపడుతోంది!

ఖరీదైన వస్తువులు కాదు.. అందమైన జ్ఞాపకాలే ముఖ్యం!
X

దిశ, ఫీచర్స్ : యువత ఎక్కువ లేదా వృథా ఖర్చు చేస్తుందని కొందరు భావిస్తుంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారుతోంది. ఒకప్పటిలా ప్రస్తుతం జెన్‌-Z, మిలీనియల్స్ రొటీన్‌గా ఆలోచించడం లేదని నిపుణులు అంటున్నారు. విజ్ఞతతో, ఆధునికతతో మేళవించిన ఆలోచనలను అమలు చేయడంలో ముందుంటున్నారని చెబుతున్నారు. ఇటీవలి మార్కెటింగ్ అధ్యయనాలు సైతం ఇదే చెబుతున్నాయి. యూత్‌ ‘మెటీరియల్ థింగ్స్’ కంటే ‘మెమరీస్’పైనే ఎక్కువ ఫోకస్ చేస్తోందని స్పష్టం చేస్తున్నాయి. ఆ వివరాలేమిటో చూద్దాం.

జ్ఞాపకాలకే ప్రాధాన్యత

జెన్‌-Z ఇప్పుడు భౌతిక వస్తువుల కొనుగోలు కంటే.. గుర్తుండిపోయే జ్ఞాపకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని కొత్త పరిశోధనలు పేర్కొంటున్నాయి. దాదాపు 68% మంది యువత తమ డబ్బును ఖరీదైన డిజైనర్ బ్యాగులు, ఆభరణాలు, గాడ్జెట్లు వంటివి కొనడం కంటే, తమకు ఆనందాన్నిచ్చే, జ్ఞాపకాలుగా మిగిలే సాధారణ అనుభవాలనే ఇష్టపడుతున్నది. ఏదైనా కొంటే గనుక అది హుందాగా, జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా, మరచిపోలేని జ్ఞాపకంగా గుర్తుండిపోవాలనే ఆలోచన జెన్‌జీ(Gen-Z)లోనూ, మిలీనియల్స్‌లోనూ పెరుగుతోంది. అలాంటి వాటిపైనే డబ్బును, సమయాన్ని ఖర్చు చేయడానికి ఇష్టపడుతోంది.

ఆ క్షణాల కోసం..

ఖరీదైన వస్తువు కొంటే కొంతకాలానికే దానిపై ఆసక్తి తగ్గుతుంది. బదులుగా అదే ఖర్చును ట్రావెల్, ఫెస్టివల్స్, కాన్సర్టులు, డైనింగ్ అవుట్ వంటి అనుభవాలపై చేస్తే.. అదొక జ్ఞాపకంగా ఉండిపోతుందనే ఆలోచలకు యువత ప్రయారిటీ ఇస్తోంది. ఎందుకిలా అంటే.. అనుభవాలు కేవలం ఖర్చుతో ముగిసిపోవు. అవి కథలుగా, జ్ఞాపకాలుగా, సామాజిక సంబంధాలుగా ఉండిపోతాయి. కొత్త ఆలోచనలను క్రియేట్ చేస్తాయని యువతరం భావిస్తోంది. ఫ్రెండ్స్‌తో గడపడం, ఆన్‌లైన్‌లో ఫొటోలు/వీడియోలు పోస్ట్ చేసుకోవడం, ఆ క్షణాలను గుర్తు చేసుకోవడం వంటివి భౌతిక వస్తువులు ఇవ్వలేని ఆనందాన్ని ఇస్తాయని ఈతరం నమ్ముతోంది. లగ్జరీ ఐటమ్స్ కొంతకాలం తర్వాత సాధారణమై పోతాయి. కానీ ఒక ఫెస్టివల్, ఒక ట్రిప్, ఒక మ్యూజిక్ ఈవెంట్ వంటివి జీవితాంతం గుర్తుంటాయి. అందుకే అలాంటి అనుభవాలపై ఖర్చు పెట్టడానికే ఇష్టపడుతోంది యువత.

Next Story