ఆన్‌లైన్ వద్దు.. నేరుగా వెళితేనే ముద్దు.. జెన్ Zలో నయా షాపింగ్ ట్రెండ్!

by Javid Pasha |

కొనుగోళ్లతోపాటు షాపింగ్‌ మాల్స్‌లో ఎంటర్టైన్మెంట్, స్నేహితులతో టైమ్ స్పెండ్ చేయడం, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేట్ చేయడం వంటివి యువతను ఆకట్టుకుంటున్నాయి.

ఆన్‌లైన్ వద్దు.. నేరుగా వెళితేనే ముద్దు.. జెన్ Zలో నయా షాపింగ్ ట్రెండ్!
X

దిశ, ఫీచర్స్ : ఆన్‌లైన్ షాపింగ్ ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చాక చాలామంది మాల్స్‌కు వెళ్లి నేరుగా కొనుగోలు చేసే అనుభవాలను కోల్పోయారు. నచ్చిన వస్తువులను ప్రత్యక్షంగా చూసి, పరిశీలించి తీసుకునే పరిస్థితులకు దూరమయ్యారు. ఉరుకులు పరుగుల జీవితంలో సమయం లేక కొందరు, ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్రకటలకు ప్రభావితమై మరికొందరు, ఇలా రకరకాల కారణాలతో ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల యువతలో ఒక కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఏంటంటే.. ప్రపంచ వ్యాప్తంగా జెన్- Z షాపర్లు, తిరిగి మాల్స్‌ వైపు అడుగులు వేస్తున్నారని, ఆన్‌లైన్ షాపింగ్‌కంటే నేరుగా వెళ్లి కొనడాన్ని ఇష్టపడుతున్నారని ప్రముఖ అమెరికన్ అంతర్జాతీయ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్‌ పేర్కొన్నది.

జెన్ Zలో మారుతున్న ఆలోచనతో ఒకప్పుడు ‘డెడ్ మాల్స్’గా పిలువబడిన షాపింగ్ కేంద్రాలు కూడా కళకళలాడే పరిస్థితులు నెలకొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 18-24 ఏళ్ల వయసుగల యువతలో ఈ ధోరణి పెరుగుతోంది. దీనికి కారణం ఆన్‌లైన్‌ షాపింగ్‌లో లభించని అనుభవాలను కోరుకుంటున్నారు. షాపింగ్ మాల్స్ కేవలం కొనుగోలు కేంద్రాలుగానే కాకుండా.. అవి సామాజిక, వినోదాత్మక కేంద్రాలుగానూ యువతను ఆకట్టుకుంటున్నాయి.

62% ఆ వయసువారే..

కొనుగోళ్లతోపాటు షాపింగ్‌ మాల్స్‌లో ఎంటర్టైన్మెంట్, స్నేహితులతో టైమ్ స్పెండ్ చేయడం, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేట్ చేయడం, ప్రొడక్ట్స్‌ను నేరుగా చూసి, తాకి కొనుగోలు చేయడం వంటి సౌకర్యాలు యువతకు మంచి అనుభవాన్ని, అనుభూతిని ఇస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్ వద్దు.. నేరుగా షాపింగ్ మాల్‌కు వెళ్లి కొనుగోలు చేయడమే ముద్దు అంటూ అటువైపు మొగ్గుతోంది యువత. ఫలితంగా గతేడాది 18-24 ఏళ్ల వయసువారు తమ సాధారణ వస్తువుల కొనుగోళ్లలో 62% స్టోర్లలోనే చేశారని నివేదికలు పేర్కొంటున్నాయి. యువత ఆసక్తులను గమనించిన యజమానులు కూడా రెస్టారెంట్లు, ఫిట్‌నెస్ సెంటర్లు, ఈవెంట్లు, ఎంటర్టైన్మెంట్ ఆకర్షణలు, ఇన్‌స్టా‌గ్రామ్‌కు అనువైన డిజైన్లను తమ మాల్స్‌లలో జోడిస్తున్నారు. ఫలితంగా ఫుట్ ట్రాఫిక్ పెరుగుతోంది. జెన్ Z లో పెరుగుతున్న ఈ ధోరణి రాబోయే సంవత్సరాల్లో రిటైల్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

Next Story