జీబ్రా స్ట్రిపింగ్.. ఆల్కహాల్ తీసుకోవడంలో యువత కొత్త పోకడ!

by Javid Pasha |

ఆల్కహాల్‌ డ్రింక్‌కు ప్రత్యామ్నాయంగా, నాన్-ఆల్కహాలిక్ డ్రింక్ తీసుకోవడమే జీబ్రా స్ట్రిపింగ్ ట్రెండ్ ప్రధాన ఉద్దేశం.

జీబ్రా స్ట్రిపింగ్.. ఆల్కహాల్ తీసుకోవడంలో యువత కొత్త పోకడ!
X

దిశ, ఫీచర్స్ : మీకు ఆల్కహాల్ సేవించే అలవాటు పోవడం లేదా? అయితే ‘జీబ్రా స్ట్రిపింగ్ ట్రెండ్’ ఫాలో అయి చూడండి. మీలో అద్భుతమైన మార్పు రావచ్చు. ఇటీవల యువతను బాగా ఆకట్టుకుంటున్న డ్రింకింగ్ అలవాటుగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పలువురిని ఆకట్టుకుంటున్నది. ఇంతకీ ఏమిటీ కొత్త పోకడ? దీనివల్ల ప్రయోజనాలేమిటి?

జీబ్రా స్ట్రైపింగ్ అంటే ?

ఇండియాలో తక్కువ.. కానీ ఫారెన్ కంట్రీస్‌లో లైట్ ఆల్కహాల్ తీసుకోవడం రోజువారీ జీవితంలో ఒక భాగంగా భావిస్తారు చాలామంది. అందుకే జెన్ Zలో ఇది మరింత పాపులర్ అయింది. అయితే ఎంతైనా ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం కదా.. కాబట్టి దానిని కంట్రోల్ చేయాలన్న ఆలోచనతో యువత కొత్త పద్ధతిని అనుసరిస్తోంది. అదే జీబ్రా స్ట్రిపింగ్ (Zebra striping). ముఖ్యంగా ఒక ‘నైట్ ఔటింగ్’లో ఆల్కహాల్‌ డ్రింక్‌కు ప్రత్యామ్నాయంగా నాన్-ఆల్కహాలిక్ డ్రింక్ తీసుకోవడమే ఈ పోకడ ప్రధాన ఉద్దేశం. జీబ్రా బాడీపై ఉన్న బ్లాక్-వైట్ చారల్లాగా ప్రత్యామ్నాయంగా తాగడంవల్ల ఈ పేరు వచ్చింది. దీంతో మొత్తం ఆల్కహాల్ తీసుకోవడం సగానికి తగ్గుతుంది. క్రమంగా పూర్తిగా మానేసే అవకాశం కూడా ఉంటుంది.

ప్రత్యామ్నాయం కోసం..

ఒక్కసారి ఆల్కహాల్ డ్రింక్, మరోసారి నాన్-ఆల్కహాలిక్ డ్రింక్ అనే ప్రత్యామ్నాయంగా పద్ధతిని అనుసరించడంవల్ల హ్యాంగోవర్, బర్న్ అవుట్ అవకుండా ఉంటారని, సామాజికంగా ఎంజాయ్ చేస్తూనే బ్యాలెన్స్‌గా ఉండటానికి ఈ విధానాన్ని అనుసరించడం బెటర్ అని ఈ ట్రెండ్ ఫాలోవర్స్ చెబుతున్నమాట. @nootdrink పేరుతో ఇది బ్రాండ్ జెన్ Zలో పాపులర్ అవుతోంది. దీనివల్ల ఫంక్షన్లు, పార్టీలు, వివిధ సామాజిక వేదికల్లో, సమావేశాల్లో సైతం మత్తులో తూగకుండా.. ఎప్పటిలాగే సేమ్ ఎనర్జీ, సేమ్ వైబ్స్‌తో గడపేందుకు హెల్ప్ అవుతోందిన యువత భావిస్తోంది. పైగా లెస్ బర్నవుట్, మెరుగైన ఆరోగ్యం, మోడరేషన్‌కు దీనివల్ల కొత్త ఇమేజ్ వచ్చిందని చెబుతున్నారు.

ఇండియాలో ఎలా ఉంది?

జీబ్రా స్ట్రిపింగ్ స్టైల్ లేదా ట్రెండ్ యూఎస్ఏ, యూకే సహా ఇతర పశ్చిమ దేశాల్లోని జెన్ Z మాత్రమే ఎక్కువగా ఫాలో అవుతుండగా.. ఇటీవల సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఇది ఇండియాలోనూ విస్తరించింది. మెట్రో నగరాలైన బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లోని యువతలో, స్టార్టప్ సర్కిల్స్‌లో క్రమంగా విస్తరిస్తోంది. అంతేకాకుండా ఇండియాలో నాన్-ఆల్కహాలిక్ కాక్‌టైల్స్ మార్కెట్ పెరుగుతోంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రయోజనాలివే..

*ఆల్కహాల్ తీసుకోవడం సగం తగ్గుతుంది

*ఆల్కహాల్ తీసుకోకపోవడం వల్ల హ్యాంగోవర్ ఉండదు

*సామాజికంగా ఎంజాయ్ చేస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు

*డీహైడ్రేషన్ తగ్గి, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది

*మెంటల్ క్లారిటీ, మంచి నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పడుతుంది.

Next Story