జుట్టు పెరగడం లేదని బాధపడుతున్నారా.. అయితే ఈ పండ్లను తినండి

by Daayi Srishailam |

Are you worried about your hair not growing? Then eat these fruits.

జుట్టు పెరగడం లేదని బాధపడుతున్నారా.. అయితే ఈ పండ్లను తినండి
X

దిశ, ఫీచర్స్

జుట్టు పెరగడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని రకాల పండ్లు తింటే ఎంత పలుచని జుట్టు అయినా ఒత్తుగా తయారవుతుందని అంటున్నారు నిపుణులు. పైనాపిల్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండి కొల్లాజెన్ ప్రొడక్షన్ పెంచి జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. నారింజ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి స్కాల్ప్ మాయిశ్చర్‌గా ఉండేలా చేస్తుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ సెబమ్ ప్రొడక్షన్ పెరిగేలా చేస్తుంది. ఇంకా దీంట్లో ఫొలేట్.. యాంటీ ఆక్సిడెంట్లు ఉండి హెయిర్ ఫోలికల్స్‌ని బలంగా చేస్తాయి. బెర్రీస్‌లో విటమిన్స్.. యాంటీ ఆక్సిడెంట్స్.. ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. అవకాడోలో బయోటిన్.. బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును పొడుగ్గా పెంచడంలో సహాయపడతాయి. కాబట్టీ జుట్టు పెరుగుదల కోసం అనవసర ప్రయోగాలు చేసే బదులు ఈ ఆరోగ్యకరమైన పండ్లు తినండి.. మీ శిరోజ సౌందర్యాన్ని కాపాడుకోండి.

Next Story