Friendship Day : దూరపు స్నేహాలు.. మరింత దగ్గరగా.. !

by Gugulothu.Kavitha |

ఆకాశంలో చందమామ భూమికి దూరమే..

Friendship Day : దూరపు స్నేహాలు.. మరింత దగ్గరగా.. !
X

దిశ, ఫీచర్స్: ఆకాశంలో చందమామ భూమికి దూరమే.. కానీ మనుషుల మనసుకు మాత్రం చాలా దగ్గర. కొన్ని స్నేహబంధాలు కూడా అంతే.. ఎప్పుడూ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. నిజమైన స్నేహితులు ఎక్కడో దూరంగా ఉన్నా.. మనసుకు మాత్రం దగ్గరగానే ఉంటారు. మమతానురాగాల పొదరిల్లులా అల్లుకుపోతారు. తలుచుకోగానే మదిలో మెదులుతుంటారు. కళ్లముందు కదులుతుంటారు. ఇదేదో ఊహించి చెప్తున్న విషయం కాదు.. స్వయానా యు.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలిన అంశం.

భౌతిక సాన్నిహిత్యం ఆధారంగానే సంబంధాలను పరిగణించే ఈ ప్రపంచంలో.. కొందరికి దూరం ఒక అడ్డంకిగా అనిపించవచ్చు. కానీ.. సరైన వ్యక్తులకు అది ఏమాత్రం అడ్డు కాదు. ఎందుకంటే స్నేహం మనసు, ఆలోచన, మానసిక స్థితితో ముడిపడి కూడా ఉంటుంది. ఓక్లహోమా యూనివర్సిటీ(University of Oklahoma)గత అధ్యయనం కూడా ఇదే చెబుతున్నది. దూరపు స్నేహాలు హృదయానికి మరింత దగ్గరై ఉంటాయని పేర్కొంటున్నది.

వ్యక్తులుగా దగ్గురున్నా, దూరమున్నా ఫ్రెండ్‌షిప్ ప్రయారిటీ తగ్గదు. దగ్గరగా ఉంటే తరచుగా కలిసి కాఫీ తాగొచ్చు. సినిమాకో, రెస్టారెంట్‌కో వెళ్లొచ్చు. సరదాగా మాట్లాడుకోవచ్చు. మరింత సన్నిహితంగా ఉండొచ్చు. అంటే.. దగ్గరి స్నేహితుల మధ్య కొన్ని అదనపు సౌలభ్యాలు ఉండొచ్చు. అలాగని దూరంగా ఉండే స్నేహాలను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే అవి మరింత బలంగా ఉంటాయి అంటున్నారు నిపుణులు. భౌతిక దూరం వాస్తవానికి మానసికంగా దగ్గర చేస్తుందని చెబుతున్నారు. అందుకే వేర్వేరు ఊర్లలోనో, వేర్వేరు దేశాల్లోనో, వేర్వేరు ప్రాంతాల్లోనో ఉన్నంత మాత్రాన హృదయాంతరాల్లో చిగురించిన స్నేహబంధాల మధ్య ప్రేమ తగ్గదు. స్నేహానికి ఢోకాలేదు. సో.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే..!

Next Story