- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral : స్నేహానికి గురుతుగా.. నది ఒడ్డున కలల సౌధాలు!
తమ స్నేహానికి గురుతుగా ఒక అద్భుతమైన ఆలోచనకు తెరతీశారు ఆ నలుగురు ఫ్రెండ్స్. అందుకోసం లానో నది ఒడ్డున తమ కలల సౌధాన్ని నిర్మించుకున్నారు.

దిశ, ఫీచర్స్ : స్నేహం ఎంతో గొప్పదని అనేకమంది వర్ణిస్తుంటారు. అన్ని పరిస్థితుల్లోనూ ఒకరికొకరు సపోర్ట్‌గా ఉండేదే నిజమైన ఫ్రెండ్‌షిప్ అని చెబుతుంటారు. ఈ కాలంలో అలాంటి స్నేహ బంధాలు తగ్గిపోతున్నాయని కూడా నిరాశ వ్యక్తం చేస్తుంటారు. అలాగనీ అన్ని స్నేహాలూ, అందరు స్నేహితులూ అలాగే ఉంటారని కూడా కాదు. కొందరు వ్యక్తులు ప్రత్యేకం. వారి స్నేహ బంధాలూ ప్రత్యేకంగానే ఉంటాయి. ఈ కోవకే చెందుతారు టెక్సాస్‌కు చెందిన నలుగురు స్నేహితులు. వీరు మూడు దశాబ్దాలుగా ఎంతో క్లోజ్‌గా, నిజాయితీగా తమ స్నేహ బంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వారు మాత్రమే కాకుండా వారి కుటుంబాలు, పిల్లలు సైతం స్నేహితుల్లాగా మసలుకుంటున్నారు. పైగా వీరు తమ స్నేహానికి గురుతుగా ఒక అద్భుతమైన ఆలోచనను ఆచరణలో పెట్టి అందరినీ ఆకట్టుకుంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తమ స్నేహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, ఒక అద్భుతమైన కలను నిజం చేయాలనుకున్నారు ఆ నలుగురు స్నేహితులు. అందుకోసం టెక్సాస్‌లోని ఆస్టిన్ సమీపంలోని లానో నది ఒడ్డున “Llano Exit Strategy” అనే పేరుతో తమ కలల ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. అంటే.. సెలవుల్లో, ఖాళీ సమయాల్లో సరదాగా, సంతోషంగా టైమ్ స్పెండ్ చేసేందుకు ఆ నలుగురు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రత్యేకంగా ఇండ్లను నిర్మించుకున్నారు. అంటే ఇది కేవలం విహారయాత్ర స్థలం మాత్రమే కాదు. వృద్ధాప్యంలో కలిసి ఆనందంగా గడపాలనే తమ భవిష్యత్ ఆలోచనకు, తమ కలల సౌధాలు ప్రతిరూపమని కూడా చెబుతున్నారు. ఇందులో భాగంగా నాలుగు ఆధునిక, మినిమలిస్ట్ క్యాబిన్లు సైతం ఉన్నాయి. ప్రతీ క్యాబిన్ కేవలం 350 స్క్వేర్ ఫీట్ వైశాల్యంలో ఉండేలా డిజైన్ చేయించారు. విశేషమేమిటంటే.. ఇవి నదివైపు అందమైన వ్యూతో రూపొందించబడ్డాయి. ఈ చిన్న కమ్యూనిటీలో ప్రైవేట్ స్పేస్‌తోపాటు అందరూ కలిసి ఉండేందుకు వసతులు ఉన్నాయి. నలుగురు స్నేహితులు, వారి కుటుంబాలు ప్రతీ వీకెండ్స్‌లో, సెలవుల్లో, పండుగ సమయాల్లో ఇక్కడికి వచ్చి కలిసి మెలిసి ఉంటారు. ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలన్న తమ ఆలోచనను “Llano Exit Strategy” అందంగా ప్రతిబింబిస్తుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. గ్రేట్ ఫ్రెండ్స్ కదా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.






