Malla Reddy Daughter in Law: మల్లారెడ్డి కోడలా మజాకా.. ఎంత గొప్ప మనసో!

by Vennela |
Malla Reddy Daughter in Law: మల్లారెడ్డి కోడలా మజాకా.. ఎంత గొప్ప మనసో!
X

దిశ, వెబ్ డెస్క్: Malla Reddy Daughter in Law: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంత ఫేమసో..ఆయన కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి కూడా అంత ఫేమస్ అని తెలిసిందే. ఎలక్షన్స్ సమయంలో మామ తరపున ప్రచారం చేసి తనదైన మార్క్ చూపించిన ప్రీతిరెడ్డి..మల్లారెడ్డి విద్యాసంస్థల ద్వారా..వైద్య విద్యారంగం ద్వారా ఎంతో సేవలందిస్తోంది. తాజాగా ఆమె చేసిన మరో పనికి మల్లారెడ్డి కోడలా మజాకా అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.

ఇంతకూ ప్రీతిరెడ్డి ఏం చేసిందంటే..విమానంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది. అవును శనివారం అర్థరాత్రి ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా..మూర్చపోయి.. నోట్లనుంచి ద్రవం కారుతూ 74 ఏళ్ల వృద్ధుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ప్రీతిరెడ్డి వెంటనే స్పందించారు. ఆమె వైద్యురాలు అనే సంగతి తెలిసిందే. ఆ వృద్ధుడిని పరీక్షించిన ప్రీతిరెడ్డి..బీపీ తక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చారు. వెంటనే ఆ వృద్ధుడికి సీపీఆర్ చేసింది.

విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు ఎయిర్ పోర్టు సిబ్బంది. ప్రీతిరెడ్డి సీపీఆర్ చేయడంతోనే ఆ వృద్ధుడి ప్రాణాలు దక్కాయంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. మేడమ్ సర్ మేడమ్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక వైద్యురాలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. ప్రాణాలు కాపాడటంతో పాటు.. మల్లారెడ్డి కోడలుగా గొప్ప మనస్సు చాటుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story