25 కేజీల బియ్యం కొని మురిసిపోయిన ఫారిన్ పోరి..!! ఎందుకో చూడండి

by Disha Web Desk 4 |
25 కేజీల బియ్యం కొని మురిసిపోయిన ఫారిన్ పోరి..!! ఎందుకో చూడండి
X

దిశ, వెబ్‌డెస్క్ః ఇండియా, చైనా, మలేషియా, సింగపూర్, పాకిస్తాన్ వంటి ఆసియా దేశాల ఆహారంలో బియ్యం ప్ర‌ధాన భాగం. పాశ్చాత్య దేశాల్లో "అన్నం" ఒక విదేశీ వంటకం. వాళ్లు రోజూ అన్నం తిన‌రు కూడా. అన్నం ఆశ్వాదించే వారు పాశ్చాత్య దేశాల్లో చాలా అరుదుగా క‌నిపిస్తారు. అయితే, ఓ అమెరికన్ యువ‌తి మాత్రం అన్నాన్ని అమితంగా ప్రేమిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో @artwitch95 అనే ఐడీతో ఉన్న అమెరికాలోని మిన్నియాపాలిస్‌కు చెందిన 26 ఏళ్ల అడ్రియన్ త‌న‌కు అన్నంపై ఎంత ప్రేముందో ఓ వీడియోలో చూపించింది. ఇది తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది. అన్నం చూసి ఇలా ఎగ్జైట్ అవుతారా..?! అని నెటిజ‌న్లు నోరెళ్ల‌బెడుతున్నారు. అడ్రియన్‌లా బియ్యం చూసి ఇంత‌లా సంతోషించ‌డం బహుశా ఎక్క‌డా చూసుండ‌రు! అందుకే ఈ వీడియో స్పెష‌ల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో @9gag అప్‌లోడ్ చేయ‌గా, దీనికి 11.5 ల‌క్ష‌ల వ్యూవ్స్‌, 48k పైగా లైక్‌లు వచ్చాయి.



Next Story

Most Viewed