మీ ఇంట్లో ధన లక్ష్మి అడుగు పెట్టాలా.. అయితే ఇలా చేయండి

by Dishanational2 |
మీ ఇంట్లో ధన లక్ష్మి అడుగు పెట్టాలా.. అయితే ఇలా చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంటికి లక్ష్మీ దేవి రావాలని అందరూ ఆశపడుతుంటారు. అందుకోసమే ఇళ్లును నీటుగా సర్దుకుంటారు. అయితే కొంత మంది ఇంట్లో ఎలాంటి మరమ్మతులు చేసినా లక్ష్మీ దేవీ మాత్రం అడుగుపెట్టదు. అలాంటి వారు ఈ నియమాలు పాటిస్తే తప్పనిసరిగా ధనలక్ష్మీ అనుగ్రహం కలుగుతుందంట. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.మీ ఇంటి ప్రధాన తలుపు ఇంట్లోని అన్ని తలపులకన్నా, పెద్దగా అందంగా ఉండాలంట.

2. గడప చూడగానే బాగుంది అనేలా ఉండాలి, ఎప్పుడూ పసుపు కుంకుమతో గడపను అందంగా తీర్చిదిద్దాలి.

3. మీ ఇంటి ఎంట్రన్స్ అందంగా , మెరిసే రంగులతో ఉండాలి, తలపులకు చీకటి కలర్ లాంటివి అస్సలే వాడకూడదు.

4. ఇంట్లో వెలుతురు పడే విధంగా ఉండాలి.

5.మీ ఇంటి యొక్క ఎంట్రన్స్ తప్పని సరిగా తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశవైపునకు ఉండాలి. ఈ దిక్కులను మంచివిగా చెబుతారు. అటువైపు నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అటు ఎంట్రన్స్ ఉంటే ధనలక్ష్మి ఇంట్లోకి వస్తుంది.



Next Story

Most Viewed