జేమ్స్ బియర్డ్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చెఫ్.!

by Daayi Srishailam |   (  Updated:2026-01-12 08:46:19  IST  )

విజయ్ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా.?

జేమ్స్ బియర్డ్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చెఫ్.!
X

దిశ, ఫీచర్స్: అమెరికాకు వెళ్లే ఇండియన్స్.. అందరూ ఐటీ జాబ్సే చేస్తరా.? చాలామంది అలాగే అనుకుంటారు. కానీ.. విభిన్న రంగాల్లో రాణిస్తూ స్థిరపడ్డవారూ చాలామందే ఉన్నారు. అలాంటివారిలో చెఫ్ విజయ్ కుమార్ ఒకరు. విజయ్ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా.?

ఇండియాలో అంటే నత్తల మసాల ఎంతో ఫేమస్. తమిళనాడులో అయితే దీనినే కన్యాకుమారి నందు మసాలా అంటారు. దానిని చేతులతో తినాలి. తమిళ సంప్రదాయం ఇది. అలాంటి రుచికరమైన లోకల్ డిషెస్‌ను అమెరికాలో అందిస్తున్నాడు చెఫ్ విజయ్ కుమార్.

నత్తల డిష్ స్పెషలిస్ట్

విజయ్ అమెరికాలో "సెమ్మా రెస్టారెంట్"లో చెఫ్. అక్కడ తానుచేసే వంటల ద్వారా బాల్య జ్ఞాపకాలను, గ్రామీణ తమిళ రుచులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. దిండిగల్‌లోని నాథం అనే ఊర్లో పుట్టి, పెరిగిన విజయ్.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంజినీరింగ్ చదవలేక క్యాటరింగ్ కాలేజీలో చేరాడు. అతడి బాల్యం పచ్చని వరిచేళ్లు, కొబ్బరిచెట్ల మధ్య సాగింది. సెలవుల కోసం మధురై సమీపంలోని అరసంపట్టిలోని అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లేవాడు. అక్కడ వాళ్లమ్మమ్మ నత్తలు సేకరించి రుచికరమైన గ్రేవీతో వండేది. నత్తలకూర తింటే స్నేహితులు ఎగతాలి చేసేవాళ్లు.

మిషెలిన్ స్టార్ రెస్టారెంట్

క్యాటరింగ్ కాలేజీకి వెళ్లాక.. నత్తలను ఎవరైనా ఇష్టంగా తింటారని తెలుసుకున్నాడు. అమెరికాకు వెళ్లి అక్కడి సెమ్మా రెస్టారెంట్లో ఇప్పుడు ఈ డిషెస్‌కి స్పెషలిస్ట్‌గా మారిపోయాడు. "కన్యాకుమారీ నందు మసాలా" అని ఆర్డరివ్వగానే విజయ్ రంగంలోకి దిగి రుచికరమైన నందు మసాలా ప్రిపేర్ చేస్తాడు. సెమ్మాలో నందు మసాలా ఆర్డర్ చేస్తే బిబ్‌లు, తడి టిష్యూలు ఇస్తారు. చేతులతో పీతను విడదీసి తింటూ రుచిని ఆస్వాదిస్తారు. గతేడాది విజయ్ ఈ రెస్టారెంట్లో చేరాడు. న్యూయార్క్‌లో మిషెలిన్ స్టార్ పొందిన ఏకైక భారతీయ రెస్టారెంట్ ఇదే.

చేతులతో తింటే తప్పా.?

సెమ్మా రెస్టారెంట్.. అన్- అపాలజెటిక్ ఫుడ్స్ గ్రూప్ నిర్వహిస్తోంది. రోనీ మజుందార్, చింతన్ పాండ్యా దీన్ని నడిపిస్తున్నారు. యూరో సెంట్రిక్ వంటల‌ను పక్కకుపెట్టి ఇండియన్ లోకల్ ఫుడ్‌ను ఇంట్లో వండినట్టు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది అన్- అపాలజెటిక్ ఫుడ్స్ గ్రూప్. మామూలుగా కన్యాకుమారీ నందు మసాలాను చేతులతోనే తినాలి. ఇండియాలో అంటే ఓకేగానీ.. అమెరికాలో ఎవరు తింటారన్నప్పుడు.. జపనీస్ రెస్టారెంట్లో చాప్‌స్టిక్స్ ద్వారా తినడం తప్పుకానప్పుడు, ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ సిస్టమ్ ఎందుకు తప్పవుతుంది అని ధైర్యంగా నత్తల వెరైటీస్ స్టార్ట్ చేశారు.

తొలి భారతీయ చెఫ్

ఇండియన్ ఫుడ్ అంటే సాగ్ పనీర్, దాల్ మాత్రమే కాదు. తమిళనాడులోని కోయంబత్తూర కొంగు వంటకాలు, మధురై, చెట్టినాడ్ విభిన్న రుచులు కూడా ఇండియన్ ఫుడ్డే అని అర్థం చేసుకోవాలి అనేది విజయ్ ఉద్దేశం. అందుకే సెమ్మాలో చికెన్ టిక్కా మసాల, బటర్ చికెన్, నాన్, సమోసా వంటి రెగ్యులర్ మెనూ ఉండదు. ఇంకా వంటకాలకు లోకల్ పేర్లే ఉండాలని అంటాడు. ఎవరి నియమాలకు లొంగకుండా మన సంస్కృతిని గౌరవిస్తూ గ్రామీణ నేపథ్యం నుంచి ఇవాళ ప్రపంచ స్థాయి చెఫ్‌గా ఎదిగి జేమ్స్ బియర్డ్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చెఫ్‌గా రికార్డు సృష్టించాడు.

Next Story