- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: ఓరిని దుంపలు తెగ.. మంటలతో మసాజ్.. ఈ వీడియో చూశారా?
Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చీమ చిటుక్కుమన్నా..వెంటనే వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చీమ చిటుక్కుమన్నా..వెంటనే వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే కొన్ని వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటే..మరికొన్ని మాత్రం తెగ నవ్విస్తుంటాయి. ఇంకొన్ని షాక్ కు గురిచేస్తుంటాయి. కొందరు ప్లాన్ చేసి మరీ ఏవేవో వీడియోలు తీస్తుంటే..మరికొన్నిసార్లు అనుకోకుండా షాకింగ్ ఘటనలు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఓ వ్యక్తికి మసాజ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది నార్మల్ మసాజ్ అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది ఫైర్ మసాజ్..అంటే ఒక మనిషిని బెడ్ పై పడుకోబెట్టి దానిపై నిప్పు పెడతారు. ఈ వీడియోలో అదే కనిపిస్తోంది. ఓ వ్యక్తిని బెడ్ పై బోర్లాపడుకోబెట్టారు. ఆ తర్వాత ఆవ్యక్తిపై ఒక దుప్పటి లాంటిది కప్పారు. తర్వాత దానిపై ఆల్కాహాల్ పోసారు. అనంతరం దానికి నిప్పంటించారు. అలా అంటించిన తర్వాత కాసేపటికి చేతిలో ఓ డోలు పట్టుకుని టపా టపా అని కొట్టాడు. అలా కొద్ది సేపటి తర్వాత మరో వ్యక్తి అతనిపై మరో దుప్పటి కప్పాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే మసాజ్ లలో ఇదొక రకమైన మసాజ్ అని తెలుస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ చాలా మంది ఈ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. ఇదేం మసాజ్ రా నాయనా అని ఓ నెటిజన్ అంటుంటే..ఇదేం పోయం కాలం రా ఇలాంటి మసాజ్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో నిపుణుల పర్యవేక్షణలో చేయాలంటూ కింద క్యాప్షన్ కూడా ఇచ్చారు.






