ఆటలే కాదు.. మీ చిన్నారులకు పొదుపు పాఠాలు కూడా నేర్పండి!

by Javid Pasha |   (  Updated:2026-01-30 07:32:42  IST  )

చిన్న మొత్తాల పొదుపు కూడా పెద్ద కష్టాల నుంచి బయటపడేస్తుంది. పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణను పెంచుతుంది. పేరెంట్స్‌ కు హెల్ఫ్ అవుతుంది.

ఆటలే కాదు.. మీ చిన్నారులకు పొదుపు పాఠాలు కూడా నేర్పండి!
X

దిశ, ఫీచర్స్ : ‘పిల్లలకు ఆటలు, చదువు ముఖ్యం తప్ప ఇతర విషయాలు వారికి చెప్పడమెందుకు?’ అంటుంటారు కొందరు. ముఖ్యంగా ఆధాయం, ఖర్చులు, అప్పులు, డబ్బు నిర్వహణ వంటివి వారివద్ద చర్చించడం మంచిది కాదని చెబుతుంటారు. అయితే ఒత్తిడి కలిగించేలా వీటి గురించి చెప్పి ఇబ్బంది పెట్టడం తప్పు కానీ.. పిల్లలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించడం మాత్రం మంచిదని నిపుణులు నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల ఏదో ఒకరోజు సగం కష్టాల నుంచి గట్టెక్కామన్న ఫీలింగ్ పేరెంట్స్ లేదా కుటుంబం అనుభవించగలుగుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా డబ్బు ఆదా చేయడం పిల్లలకు నేర్పితే.. అది వారికే కాదు, పేరెంట్స్‌కు కూడా చాలా హెల్ప్ అవుతుంది. చిన్న మొత్తాల పొదుపు పెద్ద కష్టాల నుంచి బయటపడేస్తుంది. పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవడుతుంది. అందుకోసం ఏం చేయాలో చూద్దామా!

చిన్నప్పటి నుంచే నేర్పించండి

చిన్న పిల్లలు చాలా విషయాల్లో పేరెంట్స్‌ను, ఇతర పిల్లలను అనుసరిస్తుంటారు. ఎవరైనా చాక్లెట్లు, బొమ్మలు కొనడాన్ని చూస్తే తమకూ కావాలని మారాం చేస్తుంటారు. అలాగనీ పేరెంట్స్ విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటే.. పిల్లలూ అదే నేర్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల ముందు ఎలా వ్యవహరించాలో తెలిసుండాలి అంటున్నారు నిపుణులు. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవాంటున్నారు. డబ్బు పొదుపు చేస్తే ఎలాంటి మేలు జరుగుతుందో మీ చిన్నారులకు అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. నాలుగేండ్ల వయస్సు నుంచే వారికి డబ్బు విలువ, పొదుపు, నిర్వహణ వంటి విషయాల గురించి చెప్పడం, నేర్పించడం చేస్తుంటే కనీసం ఏడెనిమిదేండ్ల వయసులో వారు అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రతిదీ కొనివ్వాలని మారాం చేయడం మానేసే అవకాశం ఉంటుంది. డబ్బు ప్రాధాన్యతను అర్థం చేసుకుంటారు.

ఆర్థిక అవసరాలు చెప్పండి

సాధారణంగా పిల్లలకు డబ్బులు, కష్టం వంటి విషయాల్లో అవగాహన ఉండదు. కాబట్టి తమకు నచ్చింది కొనివ్వాలని అడుగుతుంటారు. ఇక్కడే పేరెంట్స్ వారిని మోటివేట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అడిగిన ప్రతిదీ అవసరం లేకపోయినా కొనివ్వడం అలవాటు చేయకూడదు. కచ్చితమైన వాటినే కొనిస్తూ అవసరం లేనివి కొంటే ఏం జరుగుతుందో, ఎలాంటి నష్టం జరుగుతుందో వివరించాలి. కొన్నింటిని అసలు కొనుగోలు చేయకపోవడంవల్ల జమ అయ్యే డబ్బుతో తర్వాత ఎన్ని డ్రెస్సులు వస్తాయో, షూలు, బ్యాగులు, సైకిల్, ఆట వస్తువులు, ఇంకా ఏవైనా వస్తువులు ఎలా కొనుగోలు చేయవచ్చో చెప్పడంవల్ల పిల్లల్లో ఆసక్తి కలుగుతుంది. ఈ క్రమంలో డబ్బు విలువ అర్థం చేసుకుంటారు. ఆర్థిక అవసరాల ప్రయారిటీ తెలుసుకుంటారు.

కిడ్డీ బ్యాంకులు కొనివ్వండి

పిల్లలు అవసరంలేని వస్తువులు, ఆరోగ్యానికి మేలు చేయని చిరుతిళ్లు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ అలా ఖర్చు చేయకుండా ఆ డబ్బులను భద్ర పర్చడం నేర్పాలి. అందుకోసం వారికి పిగ్గీ లేదా కిడ్డీ బ్యాంకులు కొనివ్వాలి. ప్రస్తుతం మార్కెట్లో రంగు రంగుల బొమమ్మలతో ఆకట్టుకునే పిగ్గీ బ్యాంకులు ఉన్నాయి. పిల్లలు వాటి ఆకారాన్ని చూసి కూడా అందులో డబ్బు వేయాలని ఉత్సాహ పడుతుంటారు. అనవసరంగా చాక్లెట్ కొనేబదులు కిడ్డీ బ్యాంకులో చిల్లర వేయడానికి ఇష్టపడుతుంటారు. ఇలా చేస్తూ ఉంటే కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత డబ్బు పోగుబడుతుంది.

సేవింగ్ హాబిట్స్

పన్నెండేండ్ల లోపు పిల్లలు అనవసర ఖర్చులను తగ్గించడంవల్ల ఏడాదికి కనీసం రూ. 10 నుంచి రూ. 40 వేలవరకు కూడా డబ్బు ఆదా చేసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైన పొదుపు కారణంగా ప్రతీ సంవత్సరం స్కూల్స్ రీ ఓపెనింగ్స్ వేళ పిగ్గీ లేదా కిడ్డీ బ్యాంకుల నుంచి తీసిన డబ్బులు పిల్లల ఫస్ట్ టెర్మ్ ఫీజులకు లేదా బుక్స్‌కు ఉపయోగడే అవకాశం ఉంటుంది. దీంతో తల్లిదండ్రుల ఖర్చు కూడా తగ్గి ఆపద సమయంలో సగం కష్టాలు గట్టెక్కిన భావన కలుగుతుంది. కాబట్టి పిల్లలకు మనీ సేవింగ్ హాబిట్స్ తప్పక నేర్పించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Next Story