- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఆఫీసులోకి FCDA.. ఫ్యూచర్ సిటీలో వేగంగా నిర్మాణ పనులు
మీర్ఖాన్ పేటలోని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) ఆఫీసు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో అక్కడి నుంచే కార్యకలాపాల నిర్వహణ

దిశ, తెలంగాణ బ్యూరో :మీర్ఖాన్ పేటలోని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) ఆఫీసు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(జూన్ 2) రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆఫీసు ప్రారంభించనున్నట్టు తెలిసింది. కొత్త ఆఫీసు నుంచే కార్యకలాపాలను నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. 16వేల ఎస్ఎఫ్టీలో నిర్మిస్తున్న జీ+1 ఆఫీసు భవనానికి సంబంధించిన అన్ని రకాల పనులు పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం నానక్ రాంగుడలోని హెచ్‌జీసీఎల్ ఆఫీసులో ఎఫ్సీడీఏ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు.
2.11ఎకరాల్లో…
ఫ్యూచర్ సిటీలోని మీర్ఖాన్ పేటలో 7.29 ఎకరాల స్థలాన్ని ఎఫ్సీడీఏకు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఎఫ్సీడీఏ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతేడాది సెప్టెంబర్‌లో భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఆఫీసును ఆధునాతన హంగులతో నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆఫీసు నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.19కోట్లు కేటాయించింది. నిర్మాణ పనులు వేగంగానే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఇప్పటికే ఎఫ్సీడీఏ పరిధిలో లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్లు సైతం జారీచేస్తున్నారు.






