పని ప్రారంభించకముందే ప్రతికూల ఆలోచనలు.. వైఫల్యానికి దారితీస్తున్న ఫెయిల్యూర్ థాట్స్..!

by Javid Pasha |   (  Updated:2025-07-11 06:32:58  IST  )

పని ప్రారంభించకముందే ప్రతికూల ఆలోచనలు.. వైఫల్యానికి దారితీస్తున్న ఫెయిల్యూర్ థాట్స్..!

పని ప్రారంభించకముందే ప్రతికూల ఆలోచనలు.. వైఫల్యానికి దారితీస్తున్న ఫెయిల్యూర్ థాట్స్..!
X

దిశ, ఫీచర్స్ : ‘‘ఇక నుంచి ఫలానా విషయంలో కచ్చితంగా ఉండాలి. మారుతున్న పరిస్థితులకు అనుగునంగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఆ గోల్ తప్పక రీచ్ (Reach) అవ్వాలి’’ ఇలా జీవితంలో సాధించాల్సిన విషయాల గురించి చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ కొందరే విజయం సాధిస్తుంటారు. మరికొందరు ఓటమిని చవి చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఓటమికి కారణమేంటనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అందుకు అనేక కారణాలు ఉండొచ్చు. కానీ చాలా వరకు ‘ఫెయిల్యూర్ థాట్స్‌’ మాత్రమే ప్రధాన కారణం అంటున్నారు మానసిక నిపుణులు.

ఆలోచనలే అసలు కారణం

ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు పని ప్రారంభించకముందే ఓడిపోతామేమోననే ఆందోళన కొందరిని వెంటాడుతూ ఉంటుంది. ఈ పరిస్థితినే ‘ఫెయిల్యూర్ థాట్స్’గా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఈ విధమైన ప్రతికూల ఆలోచనలే సంగం ఓమిటిని డిసైడ్ చేస్తాయి. రోజువారీ సాధారణ అలవాట్లలో కూడా ఇటువంటి ఆలోచనలు కీ రోల్ పోషిస్తుంటాయి. అనుకోవడం, లక్ష్యం నిర్దేశించుకోవడం ఈజీనే. కానీ దానిని చేరాలంటే తగిన వనరులు, అవకాశాలతో పాటు మానసిక సంసిద్ధత చాలా ముఖ్యమని, మానవ మెదడు అనుభవాలను రూపొందించడంలో, ప్రాసెస్ చేయడంలో ఇది పవర్‌ఫుల్ టూల్‌గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే మీరు సాధించాల్సిన అంశాల గురించి ఎక్కువ భాగం నెగెటివ్‌గా ఆలోచిస్తే నిజంగానే ఓటమి దరిచేరే అవకాశం ఉంటుందని, దీంతో పర్సనల్ గ్రోత్ ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

నెగెటివ్ సెల్ఫ్ టాక్

ఒక విషయంలో విజయం సాధించాలంటే.. సానుకూల, ప్రతికూల ఆలోచనల సంఘర్షణ జరగాలి. కానీ ఇక్కడ కేవలం ప్రతికూల ఆలోచనలు మాత్రమే ఎక్కువైతే.. వీటినే ‘నెగెటివ్ సెల్ఫ్ టాక్’ అంటారు. ఇవి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకునే ధోరణికి దారితీస్తాయి. ఫలితంగా వ్యక్తులు తమ గురించి తామే స్వీయ ప్రతికూల భావానికి గురవుతారు. ఈ అలవాటు లేదా ఆలోచన వైఫల్యానికి దారితీస్తుంది. నిజానికి ఇది సెల్ఫ్ క్రిటిసిజం, సెల్ఫ్ డౌట్, సెల్ఫ్ డిప్రెషన్‌తో నిండిన ఇంటర్నల్ డైలాగ్‌లతో కూడిన ఒక సాధారణ అలవాటుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రమంగా అంతర్గత సమస్యలను, లోపాలను మరింత పెంచుతుంది. స్వీయ ప్రతికూల ధోరణి పెరిగి కాలక్రమేణా ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. లక్ష్యాలను, ఆకాంక్షలను కొనసాగించడం కష్టతరం చేస్తుంది.

పర్ఫెక్షనిజం కూడా బలహీనతే

పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఇది మరీ ఎక్కువైతేనే నష్టం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే సంపూర్ణంగా లేదా పరిపూర్ణంగా ఉండాలనే అతి ఆలోచన వాస్తవానికి మీలో బలహీనతకు దారితీస్తుంది. ప్రతిదీ పర్‌ఫెక్ట్‌గా చేయాలనే ఆలోచనతో ఏ పనీ సక్రమంగా చేయలేకపోవచ్చు. అందుకే మీరు చేస్తున్న పనిలో, ఉద్యోగంలో, ఇంకా ఏ రంగంలో రాణించాలన్నా పర్ఫెక్షనిజంపై ఎక్కువగా ఆధారపడితే చివరికి ఇది వైఫల్యానికి దారితీయవచ్చు అంటున్నారు నిపుణులు. పర్ఫెక్షనిజం స్వీయ బలహీతనకు దారితీస్తుందని కూడా పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. కాబట్టి ప్రతీది పరిపూర్ణంగా ఉండాలనే అతిధోరణికి స్వస్తి పలకాలంటున్నారు నిపుణులు. అందుకే ఒక విషయంలో నిర్ణయం తీసుకోకముందే ఓడిపోతామనే ఆందోళనలను, పని ప్రారంభించకముందే సక్సెస్ రాదేమోననే ఆలోచనలను వదులుకున్నప్పుడే అసలైన సక్సెస్ సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.

Next Story