మనిషి మరణించినా ఫేస్‌బుక్ పోస్టులు ఆగవ్.. ఇక అది వాళ్ల పనే..

by Sujitha Rachapalli |   (  Updated:2026-04-11 19:41:40  IST  )

సాధారణంగా మనిషి చనిపోతే ఆ వ్యక్తికి సంబంధించిన ఫేస్ బుక్ పోస్టులు ఆగిపోతయ్.. లేదంటే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు రెండు, మూడు సార్లు పోస్టులు పెట్టి వదిలేస్తరు.. కానీ ఇలా కాకుండా మెటా ఓ నిర్ణయం తీసుకుంది.

మనిషి మరణించినా ఫేస్‌బుక్ పోస్టులు ఆగవ్.. ఇక అది వాళ్ల పనే..
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న సెలబ్రిటినో లేదా స్నేహితుడో లేదా బంధువో హఠాత్తుగా మరణిస్తే... ఆయన పోస్టులను రీ పోస్ట్ చేస్తూ గుర్తుచేసుకుంటారు చాలా మంది. ఆయన గురించి స్పెషల్ పోస్ట్‌లు పెడుతూ మిస్ అవుతున్నామని చెప్తుంటారు. అయితే చనిపోయిన వ్యక్తి పోస్టులను తన ఆన్ లైన్ ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఉండేలా ఓ ఐడియాతో ముందుకొచ్చింది మెటా. ఇందుకు సంబంధించిన ఒక ఏఐ టెక్నాలజీ పేటెంట్ పొందింది. ఈ టెక్నాలజీ ద్వారా ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారి సోషల్ మీడియా అకౌంట్ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి)లో పోస్ట్‌లు పెట్టడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం వంటి పనులు చేయగలదు. అంటే వారు చనిపోయినా నెట్టింటి సమాజంలో బతికి ఉన్నట్టుగానే లెక్క.

ఈ టెక్నాలజీలో ‘SNS అవతార్ (సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ అవతార్)’ అనే డిజిటల్ వెర్షన్‌ను క్రియేట్ చేస్తారు. ఇది వినియోగదారుడి గత డేటాను.. అంటే పోస్ట్‌లు, కామెంట్‌లు, లైక్‌లు, మెసేజ్‌లు, పోస్టింగ్ ఫ్రీక్వెన్సీ వంటివి విశ్లేషించి.. ఆ వ్యక్తి పోస్టింగ్ స్టైల్, బిహేవియర్‌ను ఫాలో అయిపోతుంది. ఆ తర్వాత AI ఆ అకౌంట్‌‌ను పూర్తిగా నడిపిస్తుంది. మెటా దీన్ని ‘మెమరీ ప్రిజర్వేషన్ (జ్ఞాపకాలను కాపాడుకోవడం)’ కోసం డెవలప్ చేస్తున్నామని పేటెంట్ డాక్యుమెంట్‌లో పేర్కొంది. ఎందుకంటే ఎవరైనా ఎక్కువ కాలం పోస్ట్ చేయకపోతే.. వారి ఫ్రెండ్స్/ఫాలోవర్స్‌కు బాధ కలుగుతుందని.. ఎక్స్‌పీరియన్స్ ప్రభావితం అవుతుందని వాదించింది. మరణం తర్వాత ఇది మరింత తీవ్రంగా ఉంటుందని వివరించింది. అయితే మెటా ప్రస్తుతానికి ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయట్లేదు కానీ పేటెంట్ మాత్రం పొందినట్లు కంపెనీ స్పోక్స్‌పర్సన్ స్పష్టం చేశారు. అంటే ఐడియాను ప్రొటెక్ట్ చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ పేటెంట్ గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. చాలామంది దీన్ని ‘డిస్టోపియన్’ లేదా ‘బ్లాక్ మిరర్’ స్టైల్ అని.. మరణాన్ని గౌరవించకుండా హేళన చేస్తుందని.. సమస్యను కాంప్లికేట్ చేస్తుందని విమర్శిస్తున్నారు. ప్రైవసీ, కన్సెంట్, ఎథికల్ ఇష్యూస్ గురించి కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Next Story