మెసెంజెర్ సీక్రెట్ చాట్స్‌లో న్యూ ఫీచర్స్.. ఇక అన్నీ భద్రం!

by Web Desk |
మెసెంజెర్ సీక్రెట్ చాట్స్‌లో న్యూ ఫీచర్స్.. ఇక అన్నీ భద్రం!
X

దిశ, ఫీచర్స్ : టెక్ దిగ్గజ కంపెనీ మెటాకు చెందిన ఫేస్‌బుక్ మెసెంజర్.. 'సీక్రెట్ చాట్' ఫీచర్స్‌లో మెరుగైన కార్యాచరణను అందించేందుకు న్యూ అప్‌డేట్ తీసుకొచ్చింది. వినియోగదారులకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్(E2EE) కమ్యూనికేషన్‌ను కల్పించే ఈ సర్వీస్.. మెసేజ్ రియాక్షన్స్, జిఫ్స్, స్టిక్కర్స్ వంటి సాధారణ సంభాషణల్లో కంటెంట్‌కు మద్దతు ఇస్తుంది. ఇక మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కూడా E2E సౌకర్యాన్ని అందిస్తుండగా.. ఈ న్యూ అప్‌డేట్‌పై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. మెసెంజర్ వినియోగదారులు 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్' గ్రూప్ చాట్స్ సహా కాల్స్ కూడా చేసుకోవచ్చని మెటా ప్రకటించింది.

అంతేకాదు రిసీపెంట్.. చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ తీసుకున్నప్పుడు సెండర్‌ను అప్రమత్తం చేసే సామర్థ్యంతో 'స్క్రీన్‌షాట్ డిటెక్షన్' ఫీచర్ అప్‌డేట్ చేశామని పేర్కొంది. ఇక రహస్య సంభాషణల్లోని మెసేజెస్‌కు రిప్లయ్ ఇవ్వడంతో పాటు ఇతర సంభాషణలకు సందేశాలను ఫార్వార్డ్ చేసేందుకు కూడా యూజర్లు స్వైపింగ్ సౌకర్యం పొందనున్నారు. అదేవిధంగా ఎవరైనా 'ఫార్వర్డ్' బటన్‌ను నొక్కినప్పుడు షేర్ షీట్ ప్రదర్శించబడుతుంది. తద్వారా వినియోగదారులు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది లేదంటే గ్రూపులతోనూ షేర్ చేయొచ్చు. అంతేకాదు యూజర్లు సందేశాన్ని ఫార్వార్డ్ చేసేముందు 'న్యూ గ్రూప్' కూడా సృష్టించగలరు.

వినియోగదారులు తాము రిసీవ్ చేసుకున్న ఏదేని మీడియాపై ఎక్కువసేపు నొక్కడం ద్వారా వీడియో లేదా చిత్రాన్ని సేవ్ చేయగలుగుతారు. అలాగే ఈ చాట్స్‌లో వీడియో లేదా ఫోటోలను పంపించేటప్పుడు వాటిని ఎడిట్ చేసే అవకాశం కూడా ఉంది. 'మీరు సీక్రెట్ చాట్స్‌ను ఉపయోగించడం, వాటిని సురక్షితంగా భావించడం చాలా ముఖ్యమని మేము భావిస్తున్నాం. కాబట్టి మీ వానిషింగ్ మెసేజెస్ స్క్రీన్‌షాట్స్ ఎవరైనా తీసుకుంటే మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము' అని మెటా బ్లాగ్ పోస్ట్‌ పేర్కొంది.


Next Story

Most Viewed