కళ్లల్లో ఆకర్షణ వెనుక.. అందమే కాదు, ఆరోగ్య రహస్యం కూడా..!

by Javid Pasha |   (  Updated:2025-07-09 04:38:30  IST  )

కళ్లల్లో ఆకర్షణ వెనుక.. అందమే కాదు, ఆరోగ్య రహస్యం కూడా..!

కళ్లల్లో ఆకర్షణ వెనుక..  అందమే కాదు, ఆరోగ్య రహస్యం కూడా..!
X

దిశ, ఫీచర్స్ : ముఖానికి ఏమందం అంటే.. ముక్కు అందం, కళ్లు అందం అంటుంటారు పెద్దలు. అంటే శరీరంలో ఇవి మాత్రమే అందానికి ప్రతీకలని కాదు కానీ, గ్లామర్‌ను వర్ణించడంలో సాంస్కృతిక, సాహిత్య పరంగా మానవుల మనసుల్లో నాటుకుపోయిన ఒక ‘అందమైన భావన’గా ఇది వ్యాప్తి చెందింది. అయినప్పటికీ ఆకర్షణీయమైన కళ్ల వెనుక కొన్ని ఆరోగ్యపరమై రహస్యాలు కూడా దాగి ఉన్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లీడెన్ యూనివర్సిటీ, అలాగే యూనివర్సిటీ ఆఫ్‌ విన్ చెస్టర్ వంటి సంస్థలలో జరిగిన పరిశోధనలు కళ్ల ఆకర్షణకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించాయి. మానవ ఆకర్షణలో, ఆరోగ్యంలో కీ రోల్ పోషిస్తాయని తెలిపాయి. ముఖ్యంగా పెద్ద కళ్లు, దట్టమైన కనురెప్పలు, కంటి ఐరిస్ చుట్టూ ఉండే గాఢమైన వలయం(Limbal ring) ఉన్న కళ్లు ఆకర్షణీయంగా గుర్తించబడ్డాయి.

పెద్ద కళ్లు లేదా చిన్నగా, నార్మల్‌గా ఉన్నప్పటికీ సమాంతరమైన (Large, parallel eyes) కళ్లు, దట్టమైన కనురెప్పలు వంటివి ఆకర్షణీయంగా భావించబడటమే కాకుండా, ఇవి యవ్వనం, జన్యు పరమైన ఆరోగ్యం, ప్యూపిల్ డైలేషన్(Pupil dilation) వంటి ఆరోగ్యాలను సూచిస్తాయని లీడెన్ యూనివర్శిటీ పరిశోధన పేర్కొన్నది. ఆకర్షణీయంగా లేవని భావించే కళ్లల్లో కొన్నిసార్లు నరాల బలహీనత, విటమిన్లు, పోషకాల లోపం వంటివి కూడా ఒక కారణం కావచ్చు. ఇక అట్రాక్టివ్ కళ్లుగా పేర్కొనే విశాలమైన ప్రాల్పెబ్రల్ ఫిషర్ (Eye opening width) కళ్లు హార్మోనల్ సమతుల్యతను, శారీరక ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తాయి. అంతేకాకుండా దట్టమైన కనురెప్పలు, దుమ్ము, ధూళి, కలుషిత గాలి, సూక్ష్మ జీవుల నుంచి మరింత రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.

Next Story