- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిన్న కాసేపటికే మళ్లీ ఆకలి వేయడం.. వ్యాధి లక్షణమా?

దిశ, ఫీచర్స్ : ఎవరికైనా ఆకలి వేయడం సహజమే. కానీ సమయం, సందర్భం లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఆకలి వేయడం, తిన్న కాసేపటికీ మళ్లీ తినాలనిపించడం మాత్రం అనుమానించదగిందే అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే ఇది అనారోగ్యానికి సంకేతం కావచ్చు. ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతుంటే కూడా ఇలా జరుగుతుంది. ఆల్రెడీ షుగర్ పేషెంట్లు అయితే గనుక, అతి ఆకలి షుగర్ లెవెల్స్ పెరిగాయనడానికి సంకేతం కావచ్చు. శరీరంలో టైప్ - 2 డయాబెటిస్ ప్రారంభమైనప్పుడు కూడా ఇలా జరుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం అతి ఆకలి ఇంకా ఏయే లక్షణాలకు దారితీస్తుందో చూద్దాం.
డయాబెటిస్
అతి ఆకలి(Excessive Hunger / Polyphagia) కొన్ని వ్యాధులకు ముఖ్య లక్షణం కావచ్చు. అలాంటి వాటిలో డయాబెటిస్ ఒకటి. ఇది సంభవించినప్పుడు గ్లూకోజ్ రక్తంలో ఉండి, కణాల్లోకి ప్రవేశించలేకపోవడంవల్ల, అంటే ఇన్సులిన్ ప్రాబ్లం వల్ల కణాలకు శక్తి లభించదు. కాబట్టి మెదడు ‘ఆకలి’ సిగ్నల్ పంపుతుంది. అందుకే అతి ఆకలి + అతి దాహం + ఎక్కువసార్లు యూరిన్ రావడం, అలసట, బరువు తగ్గడం, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కూడా అతి ఆకలితోపాటు ఉంటాయి.
హైపర్‌థైరాయిడిజం
హైపో థైరాయిడిజం బాధితుల్లో కూడా తిన్న వెంటనే మళ్లీ తినాలనిపించే కోరిక పెరుగుతుంది. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవడం వల్ల జీర్ణక్రియలో వేగం పెరిగి శక్తి త్వరగా ఖర్చవుతుంది. కాబట్టి ఆకలి పెరుగుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడం, చెమటలు పట్టడం, గుండె వేగం పెరగడం, చేతులు వణకడం కూడా ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు.
హైపోగ్లైసీమియా
తిన్న వెంటనే మళ్లీ తినాలనిపించే నిరంతర కోరిక హైపో గ్లైసీమియా లక్షణం కూడా కావచ్చు. ఎందుకంటే ఈ పరిస్థితిలో ఇన్సులిన్ అధికమవడం, ఆహారం తక్కువ కావడం, డయాబెటిస్ మందుల ఓవర్‌డోస్ వంటివి అతి ఆకలికి దారితీస్తాయి. చెమటలు పట్టడం, వణుకు, గందరగోళం, మూర్ఛ వంటివి కూడా సంభవించే చాన్స్ ఉంటుంది. కొందరికి ప్రెగ్నెన్సీ సందర్భంలోనూ ముఖ్యంగా 2వ, 3వ త్రైమాసికంలో కూడా అతి ఆకలి సమస్య ఎదురు కావచ్చు. ఇది ప్రమాదకరం కాదు. డాక్టర్ సలహా పాటించాలి.
స్ట్రెస్, యాంగ్జైటీస్
స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీస్ వంటివి కూడా ఎమోషనల్ ఈటింగ్ లక్షణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఆకలి విషయంలో నియంత్రణ కోల్పోయేందుకు దారితీస్తుంది. కాబట్టి మళ్లీ మళ్లీ తినాలనే కోరిక పెరుగుతుంది. కాబట్టి పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి తగిన సూచనలు పాటించడం ఉత్తమం.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






