Extreme hunger : అతి ఆకలి వ్యాధి లక్షణమా?

by Javid Pasha |   (  Updated:2025-01-22 14:20:31  IST  )

Extreme hunger : అతి ఆకలి వ్యాధి లక్షణమా?

Extreme hunger : అతి ఆకలి వ్యాధి లక్షణమా?
X

దిశ, ఫీచర్స్ : మనిషికి ఆకలి వేయడం సహజం.. కానీ సమయం, సందర్భం లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఆకలి వేయడం, తిన్న తర్వాత కూడా వెంటనే మళ్లీ తినాలనిపించడం మాత్రం అనుమానించదగిందే. ఎందుకంటే ఇది అనారోగ్యానికి సంకేతం కావచ్చు. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతుంటే కూడా ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆల్రెడీ షుగర్ పేషెంట్లలో అయితే అతి ఆకలి షుగర్ లెవెల్స్ పెరిగాయనడానికి సంకేతం. ఇక ఏ సమస్యా లేనివారిలోనూ మితిమీరిన ఆకలి లక్షణాలు కనిపిస్తుంటే షుగర్ నిర్ధారిత టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. ఎందుకంటే శరీరంలో టైప్ - 2 డయాబెటిస్ ప్రారంభమైతే కూడా ఈ సమస్య ఎదురవుతుంది.

రక్తంలో చక్కెరస్థాయిలు లేదా గ్లూకోజ్ లెవల్స్ పెరిగినా.. తగ్గినా మితిమీరిన ఆకలి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ పెరిగినప్పుడు దాహం అధికంగా వేస్తుంది. తరచుగా యూరిన్‌కు వెళ్లాలనిపిస్తుంది. గ్లూకోజ్ లెవల్స్ క్రాష్ అయ్యే క్రమంలో గుండె వేగంగా కొట్టుకోవడం, కాళ్లు, చేతులు చెమటలు పట్టడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దేనిపైనా సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడం, గందరగోళం, టెన్షన్ వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొంతకాలంగా అలాగే కొనసాగుతుంటే.. జుట్టు రాలడం, మహిళల్లో అయితే ముఖంపై వెంట్రుకలు పెరగడం వంటివి సంభవిస్తాయి. కాబట్టి లక్షణాలు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. లేకపోతే శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవడంవల్ల ఇతర ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి. నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలు, గుండె వైఫల్యం వంటి అనారోగ్యాలకు దారితీయవచ్చు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story