- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొబైల్ రేడియేషన్‌తో తేనెటీగలు నాశనం..! జీవ వైవిధ్యానికి ముప్పేనా?
రేడియేషన్ ఎక్స్‌పోజర్‌వల్ల ప్రపంచ ఆహారంలో మూడింట ఒక వంతు పంటలను పరాగసంపర్కం చేసే తేనెటీగలు నాశనం అవుతన్నాయి.

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ వాడుతున్నారు. మానవ జీవితంలో అదొక భాగమైపోయింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ పరంగా సరికొత్త మార్పులకు దారితీస్తోంది. అదే సందర్భంలో గ్యాప్ ఇవ్వకుండా గంటల తరబడి వాడితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కూడా నిపుణులు చెబుతుంటారు. కాగా పోలాండ్‌లోని వ్రోక్లా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఒక అధ్యయనం మాత్రం మరో కొత్త విషయాన్ని వెల్లడించింది. మొబైల్ పోన్ వాడకం తేనెటీగల(Bees) వినాశనానికి దారితీస్తున్నట్లు పేర్కొన్నది.
సాధారణంగానే ఫోన్ల వాడకంవల్ల రేడియేషన్ వెలువడుతుంది. అయితే అలా వెలువడే 900 MHz రేడియోఫ్రీక్వెన్సీ రేడియేషన్ (RF radiation) మాత్రం తేనేటీగలకు, ప్రకృతిలో అతి సూక్ష్మమైన కొన్ని జీవులకు నష్టం చేకూరుస్తుందని పరిశోధకులు గుర్తించారు. మానవులు కేవలం ఒక గంట మొబైల్ ఫోన్ వాడితేనే.. దాని నుంచి వెలువడే రేడియేషన్ ఫ్రీక్వెన్సీకి గురైన తేనెటీగల్లో తీవ్రమైన పోషకాహార లోపం ఏర్పడుతుందని, అవి శక్తిహీనంగా మారుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌ఫోన్లు, సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ ఎక్స్‌పోజర్‌వల్ల ప్రపంచ ఆహారంలో మూడింట ఒక వంతు పంటలను పరాగసంపర్కం(Pollination) చేసే తేనెటీగలు సెల్యులార్ స్థాయిలో ఆకలి సమస్యకు గురవుతున్నాయి. ఈ పరిస్థితి భవిష్యత్తులో తేనెటీగల జనాభాను నాశనం చేయడం ద్వారా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Link






