- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health : నోటి పరిశుభ్రత కోసం మౌత్‌వాష్.. వామ్మో ఇంత డేంజరా!!
నోరు కేవలం దంతాలు, చిగుళ్లకు మాత్రమే పరిమితం కాదు, శరీరంలోని కార్డియోవాస్క్యులర్ వ్యవస్థలో భాగం.

దిశ, ఫీచర్స్ : ‘నోటి పరిశుభ్రత కోసం మౌత్ వాష్ వాడండి’ అని చాలామంది చెబుతుంటారు. కానీ రోజూ వాడితే మాత్రం దానివల్ల మీ శరీరానికి నష్టం కలుగుతుందని ఎవరైనా చెప్పారా? ఎందుకంటే.. నోరు కేవలం పరిశుభ్రతకు సంబంధించినది మాత్రమే కాదు. అది మీ హృదయ నాళ వ్యవస్థలో భాగం. కాబట్టి మౌత్ వాష్ (నోటి ద్వారా పుకిలించే లిక్విడ్) ఉపయోగించే ముందు దానివల్ల లాభమా? నష్టమా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇటీవల పరిశోధనలు సైతం ఇదే హెచ్చరిస్తు్న్నాయి. ఆ వివరాలేమిటో చూద్దామా!
ఓరల్ హైజీన్ అనేది మొత్తం ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. అలాగనీ ప్రతీ రోజు లేదా ఎక్కువగా మౌత్ వాష్ వాడితే మాత్రం నష్టోయే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కొన్ని రకాల యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్‌లు వాడినప్పుడు, అవి నోటిలోని ఆరోగ్యానికి మేలు బ్యాక్టీరియాలను కిల్ చేస్తాయని చెబుతున్నారు. 2020లో నిర్వహించిన ‘San Juan Overweight Adults Longitudinal Study (SOALS)’ అధ్యయనం కూడా ఇదే పేర్కొన్నది.
నోరు కేవలం దంతాలు, చిగుళ్లు మాత్రమే పరిమితం కాదు, శరీరంలోని కార్డివాస్క్యులర్ వ్యవస్థలో భాగం. నోటిలోని కొన్ని మంచి బ్యాక్టీరియా(Nitrate-reducing bacteria)లు ఆహారంలోని నైట్రేట్‌ను ‘నైట్రైట్’గా మార్చి, దాని నుంచి నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి, రక్త ప్రవాహాన్ని & అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. అయితే యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్, ముఖ్యంగా క్లోర్హెక్సిడిన్ లేదా అదర్ స్ట్రాంగ్ ఫార్ములాస్ ఉపయోగించినప్పుడు ఈ బ్యాక్టీరియాలను అది చంపేస్తుంది. దీంతో నోటిలో నైట్రైట్ ఉత్పత్తి తగ్గి, రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పడిపోతాయి. ఫలితంగా రక్తపోటు పెరగడం, రక్త నాళాల సౌలభ్యం తగ్గండి వంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే డాక్టర్ల సలహా లేకుండా మౌత్ వాష్‌లు తరచుగా వాడకూడదని సూచిస్తున్నారు.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
యాంటీ సెప్టిక్ మౌత్‌వాష్ ఉపయోగించిన వారిలో సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ 2-5 mmHg పెరిగినట్లు అనేక చిన్న చిన్న క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైనట్లు నిపుణులు చెబుతున్నారు. మూండేండ్లపాటు జరిగిన ఒక ముఖ్యమైన అధ్యయనం(San Juan Overweight Adults Longitudinal Study) కూడా రోజుకు రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు మౌత్‌వాష్ ఉపయోగించేవారిలో హైపర్‌టెన్షన్ (blood pressure) రిస్క్ రెట్టింపు అయినట్లు తేలింది. మరికొన్ని అధ్యయనాలు డయాబెటిస్ ప్రమాదం కూడా పెరగవచ్చని సూచిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రధానంగా యాంటీ బ్యాక్టీరియల్ మౌత్‌వాష్‌ల వల్ల జరిగే నష్టాలు మాత్రమే. సాధారణ ఫ్లోరైడ్ మౌత్‌వాష్‌లవల్ల ఇంత ఎక్కువగా ప్రభావం ఉండకపోవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






