మీ INSTA, FACEBOOK స్లో డౌన్ అవుతున్నాయా..? ఈ ట్రిక్స్ పాటిస్తే చాలు..!

by Javid Pasha |

మీ సోషల్ మీడియా యాప్‌లు స్లోగా పనిచేస్తుంటే మాత్రం మీరు చేయాల్సిన పని ఒకటుంది. వెంటనే ‘ఆటో ప్లే వీడియో’ ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి.

మీ INSTA, FACEBOOK స్లో డౌన్ అవుతున్నాయా..? ఈ ట్రిక్స్ పాటిస్తే చాలు..!
X

దిశ, ఫీచర్స్ : మీరు ఇన్‌స్టా‌గ్రామ్ యూజర్లా? ఫేస్‌బుక్ వాడుతున్నారా? ఎక్స్‌లో నిమగ్నమైపోతున్నారా? అవి యాక్టివ్‌గానే పనిచేస్తున్నాయా? లేదా ఓపెన్ చేయగానే స్లోగా రన్ అవుతున్నాయా? స్లోగా పనిచేస్తుంటే మాత్రం మీరు చేయాల్సిన పని ఒకటుంది. అదే ‘ఆటో ప్లే వీడియో’ ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే మీ మొబైల్ డేటా ఆదా అవుతుంది. పైగా క్లిక్ చేసినప్పుడల్లా స్లో డౌన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం సెట్టింగ్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఇన్‌స్టా‌గ్రామ్‌లో..

యాప్‌ను ఓపెన్ చేసి, కుడివైపు మూలన కనిపించే ప్రొఫైల్ పిక్చర్‌ను క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్‌కు పైభాగంలో కుడి మూలన కనిపించే మూడు అడ్డగీతలు గల మెనూ మీద క్లిక్ చేయాలి. తర్వాత సెట్టింగ్ అండ్ ప్రైవసీని ఎంచుకోవాలి. ఆ తర్వాత డేటా యూసేజ్ అండ్ మీడియా క్వాలిటీ ఆప్షన్‌లో, యూజ్‌లెస్ సెల్యులర్ డేటా ఆప్షన్‌ను ఆన్‌ చేస్తే సరిపోతుంది. అడిషనల్‌గా మీడియా క్వాలిటీలో వీడియోలను లో- రిజల్యూషన్‌లో లోడ్ అయ్యేలా కూడా సెట్ చేయవచ్చు. అయితే ఇది వీడియో ఆటో ప్లేను పూర్తిగా ఆపదు కానీ.. డేటా వినియోగాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఫేస్‌బుక్‌లో..

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్‌‌ను ఓపెన్ చేయగానే అక్కడ కనిపించే నావిగేషన్ బార్ కింద కనిపించే ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసి, సెట్టింగ్స్‌ అండ్ ప్రైవసీలోకి వెళ్లి, అక్కడ కనిపించే సెట్టింగ్స్ మీద కూడా క్లిక్ చేయాలి. ఇందులో మీడియా కింద భాగంలో ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మెనూలో యువర్ ఫీడ్ అండ్ ఇన్ స్టోరీస్‌లో వీడియో ప్లే బ్యాక్ బటన్ కనిపిస్తుంది. అక్కడే మీరు నెవెర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే చాలు. వీడియో ఆటో ప్లే ఆగిపోతుంది. మీ ఫేస్‌బుక్ పనితీరు మెరుగు పడుతుంది.

ఎక్స్‌లో..

ఎక్స్ యాప్‌ను ఓపెన్ చేసి, లెఫ్ట్ సైడ్ మూలన ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపించే లిస్ట్‌లో కిందికి వెళ్తే, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ కనిపిస్తుంది. ఇక్కడ యాక్సెసిబిలిటీ, డిస్‌ప్లే, లాంగ్వేజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, మరో మెనూ కనిపిస్తుంది. ఇక్కడే మీరు డేటా యూసేజ్ ఆప్షన్‌లో నెవర్ లేదా వై-ఫై ఒన్లీ ఎంచుకుంటే వీడియో ఆటో ప్లేను ఆఫ్ చేయవచ్చు.

Next Story