- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గర్భిణులు రోజుకు రెండు గుడ్లు తింటే.. పుట్టబోయే బిడ్డలో వచ్చే మార్పులివే..
ప్రెగ్నెన్సీలో ఎక్కువ గుడ్లు తినే తల్లుల బిడ్డల్లో బ్రెయిన్ మెచ్యూరిటీ కూడా మెరుగ్గా ఉంటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

దిశ, ఫీచర్స్ : తెలివైన బిడ్డకు జన్మనివ్వాలంటే గర్భిణులు తగిన పోషకాహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అలాంటి వాటిలో గుడ్డు కూడా ఒకటి. గర్భధారణ సమయం నుంచి బిడ్డ పుట్టే వరకు రోజూ రెండు గుడ్లను తినడంవల్ల పిల్లల్లో మెదడు కణాల ఏర్పాటు, నాడీ సంబంధాలు బలోపేతం అవుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా పుట్టబోయే పిల్లల్లో గుర్తుంచుకునే, నేర్చుకునే సామర్థ్యాల అభివృద్ధిలోనూ గుడ్డులోని పోషకాలు ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. ఇంకా ఏయే లాభాలున్నాయో ఇప్పుడు చూద్దాం.
ఒక గుడ్డులో సుమారు 147 mg కోలిన్ (choline) ఉంటుంది. అంటే రెండు గుడ్లు దాదాపు 294-300 mg కోలిన్ అందిస్తాయి. గర్భిణులకు సిఫార్సు చేయబడిన రోజువారీ కొలిన్ మోతాదు 400-450 mg. అంటే రెండు గుడ్లు తినడంవల్ల ఇది సరిపడా లభిస్తుంది. కోలిన్ ఫోలేట్ లాగానే బ్రెయిన్ డెవలప్‌మెంట్‌లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. గుడ్లలో కోలిన్‌తో పాటు హై క్వాలిటీ ప్రోటీన్, ల్యూటిన్, జీయాక్సాంతిన్, ఒమేగా-3 వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ బిడ్డ పరిపక్వతను మెరుగు పరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీలో ఎక్కువ గుడ్లు తినే తల్లుల బిడ్డల్లో బ్రెయిన్ మెచ్యూరిటీ కూడా మెరుగ్గా ఉంటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
చిన్న చిన్న ఆహార ఎంపికలు కూడా పుట్టబోయే బిడ్డల భవిష్యత్ జ్ఞాన సామర్థ్యం, దృష్టి, అలాగే నేర్చుకునే సామర్థ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అయితే పచ్చి గుడ్లు గానీ, ఉడికీ ఉడకని గుడ్లు గానీ తీసుకోవడం ప్రమాదకరం. కాబట్టి పూర్తిగా ఉండికించిన లేదా వండిన గుడ్లను మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే గర్భిణులుగా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ సమస్య లేదా డయాబెటిస్ ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా తప్పక తీసుకోవాలి. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. మొత్తం ఆహారంలో గుడ్లతోపాటు కూరగాయలు, పండ్లు, ఇతర ప్రోటీన్ మూలాలు కూడా సమతుల్యంగా తీసుకోవాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






