పిల్లల్లో ఆత్మవిశ్వాసరం పెరగాలంటే.. పేరేంట్స్ చేల్సింది ఇదే..!

by Javid Pasha |   (  Updated:2025-12-14 07:57:45  IST  )

పిల్లలతో తల్లితండ్రులు తరచూ మాట్లాడుతూ ఉండాలి. దీంతో వారిలో భయం, ఒత్తిడి వంటివి తగ్గిపోతాయి. అన్ని పరిస్థితుల్లోనూ పేరెంట్స్ తమతో ఉన్నారని నమ్మడంతో ధైర్యం ఏర్పడుతుంది. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచుతుంది.

పిల్లల్లో ఆత్మవిశ్వాసరం పెరగాలంటే.. పేరేంట్స్ చేల్సింది ఇదే..!
X

దిశ, ఫీచర్స్ : చిన్న పిల్లల మనసు తెల్లకాగితం లాంటిది అంటారు నిపుణులు. ఆ కాగితంలో ఏ గీతలు గీస్తే ఆ గీతలే వారిని పెద్దయ్యాక ప్రభావితం చేస్తాయని చెబుతుంటారు. అందుకే మీ చిన్నారులు తర్వాతి జీవితంలో ఆనందంగా, ఆత్మ విశ్వాసంతో ఉండాలంటే వారిని అలా మార్చడం మీ చేతుల్లోనే ఉందనే విషయం పేరెంట్స్ గుర్తించాలి అందుకోసం వారిని చిన్నప్పటి నుంచే అలాంటి ప్రాక్టీస్ చేయించాలి.

* మోటివేషన్ : పిల్లలు శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమనే నమ్మకం వారిలో ఏర్పడుతుంది. కానీ ఇటీవల చాలా మంది పిల్లలు ఒత్తిడితో కూడిన చదువులు, వయసుకు మించిన ఆలోచనలు వంటి కారణాలతో మానసిక ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నారు. అయితే వాటిని అధిగమించడానికి, పిల్లలు మెంటల్లీ బలంగా మారడానికి తల్లిదండ్రులు తగిన మోటివేషన్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వాటిలో కమ్యూనికేషన్, సమాజంపై అవగాహన వంటివి చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

*కమ్యూనికేషన్: పిల్లలతో తల్లితండ్రులు తరచూ మాట్లాడుతూ ఉండాలి. వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ ఉండాలి. దీంతో వారిలో భయం, ఒత్తిడి వంటివి తగ్గిపోతాయి. అన్ని పరిస్థితుల్లోనూ తమ పేరెంట్స్ ఉన్నారని నమ్మడంతో ధైర్యం ఏర్పడుతుంది. అది పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఆ తర్వాత పేరెంట్స్ అవసరం లేకుండానే సమస్యలను ఎదుర్కొనే స్థాయికి ఎదుగుతారు.

*సమాజంపై అవగాహన: మీ పిల్లలకు సామాజిక నైపుణ్యాలు నేర్పించాలి. ఇతరులతో ఎలా మసలుకోవాలి? ఎలా మాట్లాడాలి? ఎలాంటి వారితో స్నేహం చేయాలి? ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు చెప్పాలి. ఎదుటివారి మనోభావాలకు రెస్పెక్ట్ ఇవ్వడం, మంచిని స్వీకరించడం, చెడును వ్యతిరేకించడం వంటివి నేర్పించాలి.

*సరైన నిద్ర, డైట్: పెద్దల కైనా, పిల్లలకైనా సరైన సమయానికి మంచి నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా పోకపోతే ఒత్తిడి పెరిగిపోయి.. మానసికంగా బాధపడుతుంటారు. కాబట్టి నాణ్యమైన ఆహారం, మంచి నిద్ర ఉండే వాతావరణాన్ని కల్పించాలి. ఇది పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

*ప్రేమ, అనుబంధం: పిల్లల పట్ల ప్రేమ చూపించాలి. వారు అడిగిన వస్తువుల్ని.. అవసరమైనవి అప్పుడప్పుడూ కొనివ్వడం కూడా చేయాలి. అలాగనీ అడిగిందల్లా కొనివ్వడం కూడా మంచిది కాదు.. ఏది అవసరమో, ఏది అనవసరమో పిల్లలకు చెప్పాలి. అలాగే వారిపై సానుభూతి చూపిస్తూనే అవసరమైన సందర్భంలో హెచ్చరించాలి. ఎప్పుడైనా సరే పిల్లలపై అరవడం, కొట్టడం వంటివి చేయకూడదు. తప్పు చేస్తే ఆ తప్పును వివరించి వారికి అర్థమయ్యేలా చెప్పాలి.

*ఫిజికల్ యాక్టివిటీస్ : పిల్లలు మానసికంగా దృఢంగా తయారు కావాలంటే.. ఫిజికల్ యాక్టివిటీస్ తప్పక ఉండాలి. చిన్న చిన్న పనులు చేయడం, గ్రౌండ్‌లో ఆటలు ఆడటం, అట్లనే యోగా, మెడిటేషన్ వంటివి కూడా పిల్లల్లోని ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. దీనికి తోడు సరైన పోషకాహారం చాలా ముఖ్యం.

*స్ఫూర్తిదాయకమైన కథలు: తల్లిదండ్రులు పిల్లల్లో ఆత్మ విశ్వాసం, దైర్యం, స్ఫూర్తిని నింపే మాటలు మాట్లాడుతూ ఉండాలి. పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి. మీరు మంచి కోసం ఏదైనా చేయగలరనే నమ్మకాన్ని వారిలో కలిగించాలి. వారిలో స్ఫూర్తిని కలిగిందే కథలు చెప్పాలి. ఇవి పిల్లల్లో ఆలోచనా శక్తిని, అవగాహనను పెంపొందిస్తాయి.

*అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం: పిల్లల్ని ఎంతసేపూ చదువుపైనే దృష్టి పెట్టాలని కొట్టడమో, తిట్టడమో తరచుగా ఫోర్స్ చేయడమో తగదు. కాసేపు వారిని ఆడుకోనివ్వండి. ప్రకృతిని, పరిసరాలను పరిశీలించనివ్వండి. అందరితో మాట్లాడటం, గమనించడం వంటివి పిల్లలకు చాలా అవసరం. అవన్నీ వారిలో అవగానను కల్పిస్తాయి. అలాగే పిల్లల్లో సృజనాత్మ ఆలోచనలను, ఆటలనుప్రోత్సహించండి. ఫిజికల్ యాక్టివిటీస్ వారిలో ఆనందాన్ని కలిగిస్తాయి. అట్లనే గోల్ ఏంటో అడిగి తెలుసుకోండి. వారి అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ మంచి చెడు అర్థం అయ్యేలా చెప్పండి.

Next Story