హార్డ్ వర్క్‌ను వదిలేయండి.. స్మార్ట్ వర్క్‌తో సంపద సృష్టించండి!

by Javid Pasha |

కొందరు.30 ఏండ్ల వయసొచ్చే సరికి లక్షల్లో సంపాదిస్తుంటే.. ఫస్ట్ క్లాస్ పాసైన పేద, మధ్య తరగతి వారు మాత్రం 20, 30 వేల జీతంతో సర్దుకుపోతుంటారు. ఎందుకో తెలుసుకోండి!

హార్డ్ వర్క్‌ను వదిలేయండి.. స్మార్ట్ వర్క్‌తో సంపద సృష్టించండి!
X

దిశ, ఫీచర్స్ : నువ్వెంత కష్టపడ్డావన్నది ఎవరూ పట్టించుకోరు.. ఎలాంటి ఫలితం వచ్చిందనేదే ఈ రోజుల్లో ముఖ్యం అంటున్నారు కొందరు పెద్దలు, నిపుణులు. ఆధునిక కాలంలో ఇదే సరైన మార్గమని చెబుతున్నారు. జీవితానికి వర్తింపజేసుకుంటేనే సంతోషంగా ఉండగలమని సలహా ఇస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చేస్తున్న క్రమంలో మనం మాత్రం మారకుంటే ఏం బాగుంటుంది చెప్పండి.. అందుకే కాలంతోపాటు పరుగెత్తండి.. ముఖ్యంగా డబ్బు సంపాదన విషయంలో హార్డ్ వర్క్ కంటే.. స్మార్ట్ వర్క్ మీద ఫోకస్ చేయండి. మీ పిల్లలకు కూడా అదే నేర్పండి అంటున్నారు నిపుణులు.

యెస్.. కష్టపడి పనిచేయడం ద్వారా కాకుండా.. తెలివిగా మేనేజ్ చేయడమే ఈ రోజుల్లో తెలివైన విషయమని చాలామంది భావిస్తున్నారు. ఉదాహరణకు మనం స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకుంటాం. మ్యాథమెటిక్స్ బాగా చేస్తాం.. గణిత సూత్రాలు బట్టీ బడతాం. పెద్దయ్యాక అవి ఏం పనికొస్తున్నాయ్.. సాధారణ లెక్కలే కదా మనకు పనికొచ్చేవి. అందుకేనేమో కొందరు వ్యక్తులు, ముఖ్యంగా ధనవంతులు తమ పిల్లల మార్కులు, ర్యాంకులు, చదువుల విషయంలో పెద్దగా పట్టించుకోరు. కానీ తెలివిగా స్మార్ట్ వర్క్ నేర్పిస్తారు. ఈక్విటీ, ఇన్వెస్ట్‌మెంట్, చక్రవడ్డీ (Like compound interest) వంటి విషయాలను నూరిపోస్తారు. అవి నేర్పించే బిజినెస్ స్కూళ్లల్లో తమ పిల్లల్ని చదివిస్తుంటారు.

అందుకేనేమో స్మార్ట్ వర్క్‌(smart work)ను, స్మార్ట్ స్టడీని నమ్ముకున్న ఫలితంగా కొందరు.. 30 ఏండ్ల వయసొచ్చే సరికి లక్షల్లో సంపాదిస్తుంటే.. ఫస్ట్ క్లాస్ పాసైన మన పేద, మధ్య తరగతికి చెందిన పిల్లలు మాత్రం ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాల్లో రాణించక 20.., 30 వేల జీతంతో సర్దుకుపోతుంటారు. సో.. మనం మారాల్సిన అవసరం ఉందిక్కడ! ఎలాగంటారా.. ? హార్డ్ వర్క్‌ను పక్కన పెట్టేసి.. స్మార్ట్ వర్క్ నేర్చుకోవడం ద్వారా అంటున్నారు నిపుణులు.

స్మార్ట్ వర్క్ అంటే ఏమిటి?

స్మార్ట్ వర్క్ అంటే.. తెలివిగా, సమర్థవంతంగా పనిచేయడం.. ఇతరులు ఏం అనుకుంటారోనని కాకుండా మీ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయడం. అంటే ఇక్కడ కష్టపడటం ఉండదా? అనే సందేహం అవసరం లేదు. కానీ ఆ కష్టాన్ని ఈజీగా చేసే మార్గం అనుసరించాలి. అంటే సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. సమయం, వనరులు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలి.

*డబ్బు కోసం పనిచేయడం : కష్టపడి పనిచేయాలన్న ఆలోచన నుంచి బయటపడండి. తెలివిగా కూడా ఎలా చేయవచ్చో ఆలోచించండి. ముఖ్యంగా పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదించడం (money making) నేర్చుకోండి అంటున్నారు నిపుణులు. స్టాక్స్, రియల్ ఎస్టేట్ లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. కానీ ఇక్కడ జాగ్రత్త సుమా.. అత్యాశలకు పోయి నష్టపోయేరు.

*ఈక్విటీ పాటించండి : ఈక్విటీ అంటే షేర్లు కొనడం ద్వారా యాజమాన్య హక్కులు పొందడం. ఇది దీర్ఘకాలంలో మీ సంపదను పెంచుతుంది. అందుకే మీరు ధనవంతులు కాకపోవచ్చు. కానీ వచ్చిన దానిలోనే ఒక్కో రూపాయి కూటబెట్టి.. చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడం, దానితో షేర్లను కొనడం ద్వారా ఈక్విటీ పాటించవచ్చు. టెక్నాలజీని ఇక్కడ కూడా ఉపయోగించుకోండి.

*క్యాఫ్ ష్లోను అర్థం చేసుకోండి : డబ్బు ఎలా పుట్టుకొస్తుంది? ఎలా పంపిణీ జరుగుతుంది? ఎలా చలామణి అవుతుంది? జీవితంలో దాని అవసరం ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి చాలు. క్యాష్ ఫ్లో ఏమిటో మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా మీ ఆదాయం, ఖర్చుల మధ్య బ్యాలెన్స్ మేనేజ్ చేయండి. నిష్క్రియ ఆదాయ వనరులను సృష్టించండి. అంటే ఎల్ఐసీ వంటివి కట్టడం, సొంత ఇండ్లు నిర్మించుకొని రెంటుకు ఇవ్వడం, ఆస్తులు, డివిడెంట్లు వంటివి ఇందులో భాగమే. మొత్తానికి నిరంతరం డబ్బు ప్రవాహం కొనసాగుతూ ఉండాలి. అంటే తక్కువ ప్రయత్నంతో లేదా పెద్దగా శ్రమ లేకుండా సంపాదించే ఆదాయ మార్గం తెలుసుకోండి.

* చక్రవడ్డీ తరహా విధానం : చక్రవడ్డీ విధానమంటే ఇక్కడ సాధారణ జనానికి అప్పు ఇచ్చి వడ్డీ మీద వడ్డీ వసూలు చేయడం కాదు. కొన్ని పథకాలు లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ తరహాలో ఉంటాయి. బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థలు అలాంటి అవకాశాన్ని కల్పిస్తాయి. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం (అసలు) మీద వచ్చే వడ్డీని, ఇక్కడ తిరిగి పెట్టుబడిగా పెట్టడం ద్వారా అధిక సంపాదన వస్తుంది. దీనికి మీరు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టినా.. సమయం పెరిగే కొద్దీ.. వడ్డీ ద్వారా సంపద కూడా పెరుగుతుంది. ఉదాహరణకు, 10% వడ్డీతో రూ.10,000 పెట్టుబడి పెడితే.. ఏండేండ్లలో రెట్టింపు అవుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. డబ్బంతా ఒకేచోట పెట్టుబడి పెట్టకండి. డైవర్సిఫికేషన్ ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు. దీనికంతా హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ నేర్చుకుంటే చాలు అంటున్నారు నిపుణులు.

Next Story