పీరియడ్ నొప్పికి స్వీట్ రిలీఫ్ : డార్క్ చాక్లెట్ మ్యాజిక్!

by Javid Pasha |

డార్క్ చాక్లెట్‌ కోకో సాలిడ్స్, కోకో బటర్ అండ్ చక్కెరలతో పాటు మెగ్నీషియం కలిగి ఉంటుంది. ఇది నెలసరి నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

పీరియడ్ నొప్పికి స్వీట్ రిలీఫ్ : డార్క్ చాక్లెట్ మ్యాజిక్!
X

దిశ, ఫీచర్స్ : నెలసరి సమయంలో అధిక నొప్పి వేధిస్తోందా? కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? అయితే తక్షణ ఉపశమనం కోసం మహిళలు డార్క్ చాక్లెట్ తినొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎదుకంటే ఇది పీరియడ్ పెయిన్ (Menstrual cramps)‌ను తగ్గించగల పోషకాలను కలిగి ఉంటుందని అధ్యయనాలు రుజువు చేశాయి. ఇందులోని మెగ్నీషియం గర్భాశయ కండరాలను రిలాక్స్ చేస్తుంది. అలాగే నొప్పికి కారణమయ్యే ‘ప్రోస్టాగ్లాండిన్స్’ ఉత్పత్తిని తగ్గిస్తుంది. నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.

డార్క్ చాక్లెట్‌ కోకో సాలిడ్స్, కోకో బటర్ అండ్ చక్కెరలతో తయారవడంతోపాటు ఇందులో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి నెలసరి నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో పాలతో తయారైన ఘన పదార్థాలు ఉండవు. కోకో శాతం 50-90% మధ్య ఉంటుంది. మిల్క్ చాక్లెట్ కంటే తక్కువ తియ్యగా, బిట్టర్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా మెగ్నీషియం కలిగి ఉండటంల్ల కండరాలకు ఉపశమనం లభిస్తుంది. ఇందులోని ఐరన్ రక్తంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగు పరుస్తుంది. అలాగే కాపర్, మాంగనీస్, ఫ్లేవనాయిడ్స్ (యాంటీ ఆక్సిడెంట్లు), ఫైబర్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనంతోపాటు ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.

రక్తపోటును, బ్లడ్ క్లాటింగ్ రిస్క్‌ను నివారించడంవల్ల డార్క్ చాక్లెట్‌ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడుతుంది. బ్రెయిన్ ఫంక్షన్ కూడా మెరుగుపడుతుంది. డయాబెటిస్ మేనేజ్‌మెంట్‌కు సహాయపడుతుంది, స్కిన్‌ను సన్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. 5% కోకో చాక్లెట్ మానసిక స్థితిని మెరుగు పర్చడమే కాకుండా గట్ మైక్రోబయోటాను మార్చుతుందని రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్ చూపించింది. అయితే రోజుకు 50 గ్రాములకంటే అధికంగా తింటే కేలరీలు పెరుగుతాయి. కాబట్టి ఇంతకంటే తక్కువగానే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story