- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ చర్మం అందంగా మెరిసిపోవాలంటే..? రోజూ కొన్ని దానిమ్మ గింజలు తింటే చాలు..!

దిశ, ఫీచర్స్ : శారీరక ఆరోగ్యంతోపాటు చర్మ ఆరోగ్యానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తుంటారు చాలామంది. స్కిన్ గ్లోయింగ్ కోసమంటూ కొందరు రకరకాల ఫేస్ క్రీములు వాడుతుంటారు. అయితే అందుకు భిన్నంగా సహజమైన పద్ధతులను అవలంభించడం, చర్మ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా దానిమ్మ గింజలు అలాంటి ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. మరి మెరిసే చర్మం కోసం వీటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.
*మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే రోజూ కొన్ని చెంచాల, కనీసం 8 టీ స్పూన్ల దానిమ్మ గింజలు తినడం మంచిదని చర్మ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైగా ఈ గింజలు కొవ్వు జీవక్రియ(Fat metabolism)ను మెరుగుపరిచి, స్పష్టమైన, మెరిసే చర్మాన్ని ప్రోత్సహించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఎదుర్కొని, ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను పెంచుతాయి. ముఖ్యంగా పాలీఫెనాల్స్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. కాబట్టి శరీరంలో వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తూ, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
*అదనంగా దానిమ్మలోని విటమిన్ సి, ఇతర పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి, చర్మానికి సహజమైన గ్లోను అందిస్తాయి. దానిమ్మ గింజల రసం తాగినా లేదా గింజలను తిన్నా కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అధిక బరువును నియంత్రిస్తాయి. అంతేకాకుండా దానిమ్మ గింజల్లోని విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, రోగాల నుండి రక్షిస్తాయి. వాటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును తగ్గించి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
*గమనిక: పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






