- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Happyness: సంతోషంగా ఉండాలా..? మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి!
Happyness: సంతోషంగా ఉండాలా..? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి!

దిశ, ఫీచర్స్ : సంతోషం సగం బలం అంటారు పెద్దలు. అయితే ఇదేం బజార్లో దొరికే వస్తువు కాదు. ఆస్తులు, డబ్బు, సౌకర్యాలు ఉంటే హ్యాపీగా ఉండొచ్చని కూడా కొందరు అనుకుంటారు. కానీ ఇవేవీ నిజం కావు. జీవితంలో అవి అవసరం కావచ్చు కానీ.. అవి మాత్రమే సంతోషాన్ని ఇవ్వలేవు. అంటే సంతోషమనేది ఇక్కడ మానసిక సంతృప్తికి సంబంధించినదని, అది మీరు ఫీలయ్యే దానిని బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకోసం కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం కూడా మీలో హ్యాపీనెస్ పెంచుతుంది అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.
లక్ష్యం ఏమిటి?
‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అంటారు పెద్దలు. అయితే మీ కల ఒకటి, ప్రయత్నం మరొకటి అయినప్పుడు మాత్రం అది నెవరవేరదు. ఆశించిన ఫలితానికి బదులు అసంతృప్తి, అపజయాలు ఎదుర్కొంటారు. అందుకే మీరు సంతోషంగా ఉండాలంటే.. మీ గోల్ ఏంటి? మీరు చేస్తున్న పని అందుకు అనుగుణంగానే ఉంటుందో లేదో ప్రశ్నించుకోండి. లేకపోతే మార్చుకోండి. అప్పుడు మీకంటూ ఓ క్లారిటీ వస్తుంది. హ్యాపీగానూ ఉంటారు.
క్లారిటీ ఉందా?
జీవితంలో ప్రతి రోజూ మీరు ఎదుర్కొనే అనుభవాలు ఏదో ఒకటి నేర్పుతుంటాయి. ప్రతీ పరిస్థితి మీరేం కావాలనుకుంటున్నారని ప్రశ్నిస్తూనే ఉంటుంది. వృత్తి నైపుణ్యం పెంచుకోవాలా? కెరీర్ మారాలా? బిజినెస్ స్టార్ట్ చేయాలా? రిలేషన్ షిప్‌లో ఎలా వ్యవహరించాలి? సమాజంలో ఎలా మసలుకోవాలి? నలుగురిలో ఎలా వ్యవహరించాలి? ఇలా ప్రతీ విషయంలో మీకంటూ ఓ క్లారిటీ ఉంటున్నదా? ఈ ప్రశ్నకు సమాధానం మీవద్ద ఎప్పుడూ రెడీగా ఉంటే.. ఎలాంటి గందరగోళం లేకుంటే మీరు జీవితంలో సంతోషంగా ఉన్నట్లే లెక్క.
ఏది వదిలేయాలి? దేనికి నో చెప్పాలి?
కొందరు సమస్యలతో సతమతం అవుతుంటారు. ప్రతి దానికీ భయపడుతుంటారు. అనేక ఆప్షన్స్ ముందున్నప్పుడు దేనిని ఎంచుకోవాలో తెలీక కన్ఫ్యూజ్ అవుతుంటారు. తమకు నచ్చని విషయాలకు నో చెప్పలేకపోతారు. అందుకే హ్యాపీనెస్ కోల్పోతారు. అలా జరగకూడదంటే.. మీకేది కావాలి? దేనిని వదిలేయాలి? దేనికి నో చెప్పాలో డిసైడ్ చేసుకోండి.
సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం
కొందరు ఇతరులు తమను గౌరవించడం లేదని, పట్టించుకోవడం లేదని తమలో తామే ఫీలవుతూ ఉంటారు. ఇది అసంతృప్తి దారి తీస్తుంది. ఇతరులు ఎల్లప్పుడూ మిమ్మల్ని గౌరవించుకుంటూ.. మీ గురించే ఆలోచిస్తూ ఉండరు కదా.. ఎవరి బిజీలో వాళ్లు ఉంటారు. అందుకే మీరు కూడా మీ గురించి మీరు ఆలోచించండి. ఇతరులు మిమ్మల్ని పట్టించుకోవడం లేదనే విషయాన్ని వదిలేసి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ మీలో ఆత్మ సంతృప్తిని పెంపొందిస్తాయని, సంతోషానికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.






