Viral video : మీ చిన్నారి నిద్రపోవడం లేదా..? ఈ బెడ్‌పై పడుకోపెడితే చాలు..!

by Javid Pasha |   (  Updated:2025-04-29 11:41:56  IST  )

Technology : మీ చిన్నారి నిద్రపోవడం లేదా..? ఈ బెడ్‌పై పడుకోపెడితే చాలు..!

Viral video : మీ చిన్నారి నిద్రపోవడం లేదా..? ఈ బెడ్‌పై పడుకోపెడితే చాలు..!
X

దిశ, ఫీచర్స్ : మీ చిన్నారి నిద్రపోవడం లేదా? మధ్య రాత్రిళ్లు లేచి ఏడుపు మొదలు పెడుతోందా? అయితే డోంట్ వర్రీ.. ఎందుకంటే ఆధునిక సాంకేతికత అందుకు చక్కటి పరిష్కారం చూపుతోంది. పిల్లల్ని నిద్రపుచ్చే వైబ్రేటింగ్ బెడ్స్ కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. జస్ట్ వాటిపై పడుకోపెడితే చాలు. క్షణాల్లోనే గాఢనిద్రలోకి జారుకుంటారు. కోల్‌క్రాఫ్ట్ (Kolcraft) ప్రపెలా (Prapela), హాలో (Halo), గ్రాకో (Graco), మంచ్కిన్ (Munchkin)

చిన్న పిల్లలు నిద్రపోవడాని(Baby falling asleep)కి చాలా సతాయిస్తుంటారు. దీంతో తల్లిగానీ, వారిని చూసుకునే సంరక్షకులుగానీ క్షణం తీరిక లేకుండా వారికోసం మేల్కోవాల్సి వస్తుంది. అయితే కిడ్స్ వైబ్రేటింగ్ బెడ్స్‌(Vibrating beds)తో అలాంటి పరిస్థితికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ప్రముఖ కంపెనీలు శిశువులకోసం వైబ్రేటింగ్ బెడ్స్, మ్యాట్రెస్ ప్యాడ్స్, బాసినెట్స్, రాకర్లను కూడా తయారు చేస్తున్నాయి. స్టోకాస్టిక్ రెసొనెన్స్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయడంవల్ల వైబ్రేటింగ్ బెడ్స్ శిశువులను నిద్రపుచ్చడంలో సహాయపడటమే కాకుండా వారి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా ఇన్‌ఫాంట్ అప్నియా (infant apnea), నియోనాటల్ ఓపియాయిడ్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ (neonatal opioid withdrawal syndrome) వంటి రుగ్మతలు ఉన్న పిల్లలు నిద్రపోవడం కష్టంగా ఉంటుంది. వైబ్రేటింగ్ బెడ్స్ వీరికి చాలా మేలు చేస్తాయి. ఇవి సున్నితమైన ప్రకంపనలు సృష్టించడం ద్వారా చిన్నారుల శరీరంలో కదలికలకు కారణం అవుతాయి. దీంతో వారు ఏడుపు కూడా ఆపుతారు. సంతోషంగా ఫీలవుతారు. హాయిగా అనిపించడంవల్ల శిశువులు త్వరగా నిద్రపోతారు. ఇది క్వాలిటీ స్లీప్‌కు దారితీస్తుంది. చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ప్రస్తుతం వైబ్రేటింగ్ బెడ్‌కు @InterestingSTEM అనే X యూజర్ పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.

Next Story