చలికాలంలో కాల్షియం లోపం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే!

by Javid Pasha |   (  Updated:2025-11-22 12:24:47  IST  )

ఎముకల్లో నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, ఎముకలు, కండరాల్లో పగుళ్లు వంటివి కూడా కాల్షియం లోపానికి సంకేతాలుగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

చలికాలంలో కాల్షియం లోపం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : మానవ శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన ఖనిజాల్లో కాల్షియం ఒకటి. ఎముకలు, దంతాలు, కండరాల బలానికి, వాటి సమర్థవంతమైన పని తీరుకు ఇది చాలా ముఖ్యం. ఒకప్పుడు మిడిల్ ఏజ్ గల వారిలోనే ఈ లోపం ఎక్కువగా కనిపించేది. కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా యువతరాన్ని కూడా వేధిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 22 శాతం మంది యువతీ యువకులు కాల్షియం లోపంతో తమ తమ పనుల్లో, కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే వృద్ధుల్లో కూడా మిగతా సీజన్లకంటే చలికాలంలో కాల్షియం లోపం ససమ్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.

ఎముకల్లో పగుళ్లు, నొప్పి

ఎముకల్లో నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, ఎముకలు, కండరాల్లో పగుళ్లు వంటివి కూడా కాల్షియం లోపానికి సంకేతాలుగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా బోన్స్ పెళుసుగా మారడం, చిన్న దెబ్బ తగిలినా తీవ్రంగా గాయపడటం, గాయం త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాల్షియం అధికంగా లభించే ఆహారాలు, ముఖ్యంగా నువ్వులు, అవిసి కూర, కరివేపాకు, రాగులు, ఉలవలు, సాల్మన్ చేపలు, టోఫు, వైట్ బీన్స్, బ్రోకలి, అత్తి పండ్లు, పాలు, ఆకు కూరలు ఆహారంలో భాగంగా తీసుకోడం వల్ల క్రమంగా ఈ సమస్యను అధిగమించవచ్చు. దీంతోపాటు ఎముకల సాంద్రతను బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యాయామాలు చేయాలంటున్నారు ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు.

కాళ్లు, చేతుల్లో జర్క్

ఒకే దగ్గర కూర్చొని పనిచేస్తున్న ఉద్యోగుల్లో, వృద్ధుల్లో, చదువుకుంటున్న యువతలో కూడా అకస్మాత్తుగా కాళ్లు, చేతులు కొద్ది క్షణాలు వణకడం లేదా జలదరింపులు, తిమ్మిరి సంభవించడం వంటి ప్రాబ్లమ్స్ ఇటీవల కామన్ అయిపోతున్నాయి. ఇది కాల్షియం లోపానికి సంకేతమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలకూర, బచ్చలి కూర, తోటకూర, మొక్కల ఆధారిత ఆహారాలు, పాలు, సాల్మన్ చేపలు, బచ్చలికూర, మెగ్నీషియం, విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడంవల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆరోగ్య నిపుణుల సూచనలను బట్టి లోపాన్ని అధిగమించడానికి అవసరమైతే కాల్షియం సప్లిమెంట్లు కూడా యూజ్ చేయవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story