- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Money mindset.. డబ్బు మనసును మార్చేస్తుంది.. ఈ విధంగా కూడా..!
ఆర్థిక సమస్యలు ఒత్తిడికి ప్రధాన మూలం. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆందోళన, డిప్రెషన్, తక్కువ స్వీయ-గౌరవం వంటి భావాలకు దారితీస్తాయి.

దిశ, ఫీచర్స్ : డబ్బు జీవితంలో ఒక భాగమే.. కానీ దానిపట్ల మీకున్న భావాలు మీ మనసును సైతం మార్చేయగలవని మీకు తెలుసా? ఆర్థిక నిపుణులు సైతం ఇదే చెబుతున్నారు. మనీ పట్ల మీ ఫీలింగ్స్ హ్యాపీనెస్, స్ట్రెస్ లెవెల్స్, అలాగే రిలేషన్‌షిప్స్‌పై కూడా ప్రభావం చూపుతాయి. ఎందుకంటే వ్యక్తుల్లో పాతుకుపోయే “మనీ మైండ్‌సెట్” అనేది డబ్బు పట్ల వారి నమ్మకాలు, ధోరణులు, భావోద్వేగాలు, ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన లేదా డిప్రెషన్, సంబంధాలలో ఘర్షణ ఏర్పడుతుంది.
*ఒత్తిడి, ఆందోళనలో పెరుగుదల : ఆర్థిక సమస్యలు ఒత్తిడికి ప్రధాన మూలం అంటారు నిపుణులు. తమ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అప్పులు పెరిగినప్పుడు ఆందోళన, డిప్రెషన్, తక్కువ స్వీయ-గౌరవం(Low self-esteem) వంటి భావాలకు దారితీస్తాయి.
* మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినడం: డబ్బు విషయంలో ఆందోళన చెందడం(Money worries) మీ నిద్ర, శక్తి స్థాయిలు, మొత్తం జీవన నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అనారోగ్యకరమైన కోపింగ్ మెకానిజమ్‌లకు దారితీస్తాయి.
*మానసిక ఆరోగ్య సమస్యలు: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏర్పడే డిప్రెషన్ భావాలు(Feelings of depression) ఆర్థిక అంశాల నిర్వహణలో మరిన్ని సమస్యలకు దారితీస్తాయి. మనీ మేనేజ్‌మెంట్ మోటివేషన్‌ను తగ్గిస్తాయి. అయితే మానియా లేదా హైపోమానియా వంటి స్థితులు ఇంపల్సివ్ ఆర్థిక నిర్ణయాలకు దారితీస్తాయి.
* సంబంధాలపై ప్రభావం : ఆర్థిక వివాదాలు, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు కుటుంబాల్లో సమస్యలకు దారితీసే అవాకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సవాళ్లు జంటల మధ్య బ్రేకప్‌లకు ప్రధాన కారణం అవుతుంటాయి. ఎందుకంటే ఇవి సంబంధాల్లో సంతృప్తిని తగ్గిస్తాయి.
* ప్రతికూల భావోద్వేగాలు: ఆదాయంలో తేడాలు అసూయ లేదా అసురక్షిత(insecurity) వంటి ప్రతికూల భావోద్వేగాల(Negative emotions:)ను కలిగిస్తాయి. ముఖ్యంగా భాగస్వాముల్లో, బిజినెస్ పార్టనర్స్‌లో ఆర్థిక అంతరాలు సమస్యలను, ప్రతికూల భావాలను కలిగిస్తాయి.
*సీక్రెట్ అండ్ ప్రెజర్ (Secret and pressure): ఒక వ్యక్తి భావోద్వేగ స్థితి వారి ఆర్థిక పరిస్థితిని భాగస్వామి నుండి దాచిపెట్టేలా చేస్తుంది. దీని వల్ల ఒత్తిడి, అవిశ్వాసం ఏర్పడతాయి.
పరిష్కారం ఏమిటి?
* మీ మనీ మైండ్‌సెట్‌ను మేనేజ్ చేయడం : మీ భావాలను గుర్తించండి, భయం, ఆందోళన, గిల్టీ(guilt)ఫీలింగ్ వంటి భావోద్వేగాలు మీ ఆర్థిక నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో గుర్తించండి.
* ఓపెన్‌గా మాట్లాడండి: మీ ఫీలింగ్స్, ఆర్థిక లక్ష్యాల గురించి భాగస్వామితో మాట్లాడండి. సమస్యలను కలిసి పరిష్కరించండి.
* సహాయం తీసుకోండి: అవసరమైతే, ఆర్థిక సలహాదారులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల నుండి సహాయం తీసుకోండి. ఇది మీ ఆర్థిక సవాళ్లను, భావోద్వేగ ప్రతిస్పందనల(emotional responses)ను నిర్వహించడానికి సహాయపడుతుంది.
*ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టండి: ఆర్థిక భద్రత (financial securit) ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైనప్పటికీ, కేవలం మీరు కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉండటం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సంతోషాన్ని ఇచ్చే అవకాశం తక్కువ. కాబట్టి మీరు కోరుకున్న ఆర్థిక భద్రత దేనివల్ల లభిస్తుందో గుర్తించి మసలు కోండి. Link






