ఉదయం లేవగానే బద్దకం ఆవహిస్తోందా..? మీలో ఉత్సాహాన్ని నింపే చిట్కాలివే..

by Javid Pasha |   (  Updated:2025-07-25 06:30:28  IST  )

ఉదయం లేవగానే బద్దకం ఆవహిస్తోందా..? మీలో ఉత్సాహాన్ని నింపే చిట్కాలివే..

ఉదయం లేవగానే బద్దకం ఆవహిస్తోందా..? మీలో ఉత్సాహాన్ని నింపే చిట్కాలివే..
X

దిశ, ఫీచర్స్ : పొద్దు పొద్దున్న సూర్యుడు ఉదయించకముందే నిద్ర మేల్కొని ఆ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారా?, నిర్మలమైన ఆకాశంవైపో, పచ్చని చెట్ల వైపో చూసినప్పుడు కలిగే ఆనందాన్ని ఎంజాయ్ చేశారా? ఎంత బాగుంటుంది కదూ.. ఇదొక్కటే కాదు ఉదయపువేళ ప్రకృతిలోని ప్రతీ దృశ్యం మనలో మధురాను భూతిని కలిగిస్తుంది. అందుకే మార్నింగ్ త్వరగా నిద్రలేచే అవాటు ఉన్నవారు, అలా లేవని వారితో పోలిస్తే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు. అయితే త్వరగా లేద్దామనుకున్నా కొందరు లేవలేకపోతారు. శరీరంలో ఏదో బద్దకం ఆవహించిన అనుభూతికి లోనవుతారు. అయితే కొన్ని రోజువారీ హాబిస్‌ను అలవర్చుకోవడం ద్వారా ఆ పరిస్థితి నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

నీళ్లు తప్పకుండా తాగండి

ఉదయం నిద్ర మేల్కోగానే ముందుగా మీరు చేయాల్సింది బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడం. అందుకోసం ముందుగా కొన్ని మంచి నీళ్లు తాగాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే చాలా మంది రాత్రిళ్లు సరిగ్గా నీళ్లు తాగరు. ఉదయం కూడా తాగకపోతే బాడీ డీహైడ్రేషన్‌కు గురికావచ్చు. కాబట్టి కచ్చితంగా నీళ్లు తాగాలి. మీ అలవాటును బట్టి నార్మల్ వాటర్, గోరు వెచ్చని నీరు.. ఇలా ఏవైనా తాగొచ్చు. దీంతో ప్రేగుల్లో కదలికలు మెరుగు పడతాయి. క్రమంగా ఈ అలవాటు మీలో బద్దకాన్ని పారదోలి ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, ప్రతి రోజూ ఉదయం మేల్కొనేలా జీవక్రియను ప్రేరేపిస్తుంది.

శరీరాన్ని కదిలించడం, సాగదీయడం

ప్రతి రోజూ ఉందయం లేవగానే బాడీ బిగుతుగా అనిపిస్తుంది చాలామందికి. అప్పుడు శరీరాన్ని ఎక్కువగా కదిలించడం లేదా తేలికగా సాగదీయం వంటివి చేయాలి. ఇది మీలో మంచి అనుభూతిని కలిగించడంతోపాటు హ్యాపీ హార్మోన్ల విడుదలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మానసిక స్థితిని కూడా మెరుగు పరుస్తుంది.

మెడిటేషన్

ఉదయం లేచిన తర్వాత వ్యాయామాలు చేయడం, వివిధ ఫిజికల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. బద్దకాన్ని పారదోలుతాయి. వీటితోపాటు యోగా లేదా మెడిటేషన్ వంటివి మీలోని ఆందోళన, ఒత్తిడులను తగ్గిస్తాయని, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఆ రోజుకు అవసరమైన ప్లాన్

పొద్దున్న లేవడంవల్ల మరో బెనిఫిట్ ఏమిటంటే.. ఆ రోజు పని ప్రారంభించేకంటే ముందే.. మీకు కాసేపైనా ఖాళీ సమయం దొరుకుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఏం చేయాలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ఏ రోజుకారోజు తగిన ప్లాన్ చేసుకోవడం, దానిని అమలు చేయడం మీలో మంచి అనుభూతిని కలిగిస్తుంది. క్రమ శిక్షణను పెంపొందిస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ తినండి

ఉదయం లేచి వ్యాయామాలు, వివిధ పనులు చేస్తుంటారు. కాబట్టి కనీస ఎనర్జీ కోసం బ్రేక్ ఫాస్ట్ చేయడం మర్చిపోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అల్పాహారం అంటే ఇడ్లీ, వడ, దోశ, పూరి వంటివి మాత్రమే కాదు, మీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం ఏదైనా కావచ్చు. క్యారట్ ముక్క, కీర దోస వంటివి కూడా బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. ఇవి మళ్లీ లంచ్ టైమ్ వరకు మీకు శక్తినిస్తాయి. ఇలాంటి రోజువారీ ఉదయపు అలవాట్లతో బద్దకం క్రమంగా బద్దకం దూరం అవుతుంది. ఉత్సాహంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. దీంతో ఉదయం త్వరగా మేల్కొనేలా మీ శరీరం, మనసు అలవాటుపడిపోతాయి.

Next Story