- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ,ఫీచర్స్ : మీరెప్పుడైనా గమనించారా..? నడీడు దాటిన వయసులో కొందరు తమను తాము విమర్శించుకుంటూ యువతకు సూచనలు చేస్తుంటారు. ఆ వయసులో నేను బాగా చదువుకోలేకపోయాననో, కెరీర్ మీద ఫోకస్ చేయలేకపోయాననో, సంపాదించే సమయంలో సమయం వృథా చేసుకున్నాననో గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేద వ్యక్తం చేస్తుంటారు. మీరు అలాంటి పరిస్థితిని ఎదుర్కో కూడదంటే.. 20-35 ఏండ్ల వయసులోపు మీ లక్ష్యాలపైనే ఎక్కువ ఫోకస్ చేయాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 1. ఫిట్‌నెస్, 2. డబ్బు సంపాదన, 3.సెల్ఫ్ -ఇంప్రూవ్‌మెంట్ అనే మూడు విషయాల నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు.
ఫిట్‌నెస్‌పై ఫోకస్
ఫిట్‌నెస్ అంటే ఆరోగ్యంగా ఉండేందుకు, కష్టపడేందుకు మీ శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. జిమ్, రన్నింగ్, యోగా లేదా బాడీవెయిట్ ఎక్సర్‌సైజ్ ఇలా మీకు నచ్చింది చేస్తూ ఫిజికల్ ఫిట్‌నెస్ సాధించుకోవచ్చు. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా ఫిట్‌నెస్ వల్ల ఎండార్ఫిన్స్ (హ్యాపీ హార్మోన్స్) విడుదలవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ‘నేను ఏదైనా సాధించగలను’ అనే భావన ఏర్పడుతుంది. ఫిట్‌నెస్ అంటే ఇక్కడ కండలు తిరిగిన శరీరం అని కాదు. ఆరోగ్యంగా ఉండటమని గుర్తుంచుకోండి
డబ్బు సంపాదన ముఖ్యం
భవిష్యత్తులో స్వచ్ఛగా, ఇబ్బంది పడకుండా బతకాలంటే 20 నుంచి 35 ఏండ్లలోపు డబ్బు సంపాదనపై ఫోకస్ చేయాలంటారు నిపుణులు. మీ ఆదాయాన్ని వృథా చేయవద్దు. సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ (Mutual Funds, Stocks, SIP), సైడ్ హస్టల్స్, స్కిల్ అప్‌గ్రేడ్ చేసి ఇన్‌కమ్ పెంచడం వంటివి చేసేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే.. 20-35లో ఆదా చేసిన ప్రతి రూపాయి 40 ఏండ్ల తర్వాత మీ జీవితాన్ని సులభతరం చేస్తుంది. నచ్చని ఉద్యోగం వదిలేయడం, ట్రావెల్ చేయడం, కుటుంబానికి సపోర్ట్ చేయడం, రిస్క్ తీసుకోవడం ఇవన్నీ సాధ్య అవుతాయి. ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. రిలేషన్‌షిప్స్ బలపడతాయి.
సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్
రోజూ 10-15 నిమిషాల మెడిటేషన్, బుక్ రీడింగ్ (సెల్ఫ్-హెల్ప్, బయోగ్రఫీలు), జర్నలింగ్ లేదా పాడ్‌కాస్ట్‌లు వినడం మీ మనసుకు రిలీఫ్ అందిస్తాయి. ఆలోచనలను క్రమబద్ధీకరిస్తాయి. లైఫ్ గోల్స్‌ను సరిగ్గా గుర్తిస్తారు. ప్రయారిటీస్ సెట్ చేసుకుంటారు. ఉదాహరణకు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలా? కెరీర్ మారాలా? అనే సందేహాలు తొలగిపోతాయి. దీంతోపాటు ప్రతీ సందర్భాన్ని, అనుభవాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ జీవితాన్ని సానుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేయాలి. 35 ఏండ్లలోపు ఇవన్నీ సాధిస్తే.. ఆ తర్వాత దశలో మీరు సంతోషంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. Link






