Daily Bath: మీరు రోజూ స్నానం చేస్తున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే అంటున్న నిపుణులు

by Phanindra |   (  Updated:2025-01-25 07:35:43  IST  )

ఏదైనా పని మీద బయటకు వెళ్లి, ఇంటికి తిరిగొచ్చినప్పుడు స్నానం చేస్తుంటాము.

Daily Bath: మీరు రోజూ స్నానం చేస్తున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే అంటున్న నిపుణులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏదైనా పని మీద బయటకు వెళ్లి, ఇంటికి తిరిగొచ్చినప్పుడు వెంటనే స్నానం చేస్తుంటాము. ఇది, మన ఇండియన్స్ కి ఒక అలవాటు లాగా మారిపోయింది. చలి కాలం, వానా కాలం అని లెక్క చేయకుండా స్నానాలు చేస్తూనే ఉంటారు. కానీ, ఇది మంచిది కాదని పలు పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ స్నానం ( Daily Bath ) చేయడం వలన లేని అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

రెండు రోజులకొకసారి స్నానం చేయాలని చెబుతున్నారు. రోజూ చేయడం వలన శరీరంలో ఇమ్మ్యూనిటీ పవర్ ( immyuty power ) తగ్గిపోయి ,ఇంటి పనులు కూడా చేసుకోలేని పరిస్థితులు వస్తాయని అంటున్నారు. అతిగా చేయడం వలన చర్మం పొడిబారుతుంది. ఇది, మన శరీరం మీద ఉండే సహాజ నూనెను కూడా తొలగిస్తుంది. దీంతో , చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సార్లు స్నానం చేయడం వలన శరీరానికి హాని కలుగుతుంది. ఒక అధ్యయనం ఏం చెబుతుందంటే.. అధిక స్నానం రోగ నిరోధక వ్యవస్థను బలహీనమయ్యేలా చేస్తుందని చెబుతుంది.

రోజులో ఎక్కువ సార్లు స్నానం చేసే దేశాల్లో మనది కూడా ఒకటి. మనం రోజూ స్నానం చేయడం వలన నీరు వృథాగా అవ్వడమే కాకుండా, మానసికంగా కూడా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడించారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story