- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Reels Watching : నిద్రపోకుండా రీల్స్ చూస్తున్నారా..? మీ ఆరోగ్యం రిస్క్‌లో పడినట్టే!
Reels Watching : నిద్రపోకుండా రీల్స్ చూస్తున్నారా..? మీ ఆరోగ్యం రిస్క్‌లో పడినట్టే!

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంవల్ల ఎన్నో లాభాలున్నప్పటికీ, సరిగ్గా వాడకపోతే నష్టాలు కూడా ఉంటాయనే విషయం తెలిసిందే. కొన్ని రకాల యాప్‌లు, సోషల్ మీడియా వేదికలు ఎంటర్టైన్మెంట్ పరంగా యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. అదే సందర్భంలో పరిమితికి మించి యూజ్ చేయడంవల్ల వ్యసనానికి కూడా దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు నిద్రపోకుండా గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూసే పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే మొత్తం ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
టిక్‌టాక్, డౌయిన్‌కు (A study on the Chinese equivalent of TikTok, Douyin) సమానమైన ఓ చైనీస్ అధ్యయనం ప్రకారం.. రీల్స్ లేదా షార్ట్స్ తరచుగా చూడటం యూజర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి నిపుణులు 4,318 మంది యువతపై, అలాగే మిడిల్ ఏజ్ వారిపై అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రాత్రిపూట రీల్స్ఎ క్కువగా చూసేవారిలో మెలటోనిన్, అలాగే ఇతర హ్యాపీ హార్మోన్ల విడుదలకు ఆటకం ఏర్పడుతోందని గుర్తించారు. అంతేకాకుండా రీల్స్ చూడటం హైబీపీ, నిద్రలేమి రిస్క్‌ను పెంచుతున్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా ఇది క్రమంగా పక్షవాతం, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని హెచ్చరించారు. రీల్స్ చూస్తున్న క్రమంలో ఏకధాటిగా మొబైల్ స్క్రీన్‌ను చూడటంవల్ల కంటి కంటిచూపు కూడా మందగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే రాత్రిపూట రీల్స్ చూసే అలవాటు కలిగిన వారిలో అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ADHD) సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి రాత్రిళ్లు రీల్స్ చూడకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు సూచిస్తున్నారు.






