- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Longevity : ఎక్కువకాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలా..? ఈ హాబిట్స్ ఫాలో అవ్వాల్సిందే..!
Longevity : ఎక్కువకాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలా..? ఈ హాబిట్స్ ఫాలో అవ్వాల్సిందే..!

దిశ, ఫీచర్స్ : ఆనందం, ఆరోగ్యంతోపాటు మనం ఎక్కువ రోజులు జీవించాలంటే రోజువారి అలవాట్లు కూడా కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు నిపుణులు చెబుతున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మెరుగైన మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం
* ఆరోగ్యకరమైన ఆహారం : ఆనందంగా ఉండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే తగిన పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చికెన్, చేపలు, గింజలు వంటి లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు(Healthy fats) అందించే ఆలివ్ ఆయిల్, ఆవాలు వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
*చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించండి : శుద్ధి చేసిన చక్కెరలు(Refined sugars), ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలను నివారించాలి. రోజుకు 2-3 లీటర్ల నీరు తాగడం వల్ల శరీర ఆరోగ్యానికి, జీవక్రియకు సహాయపడుతుంది. పరోక్షంగా దీర్ఘాయువుకు కారణం అవుతుంది.
*మితంగా తినండి: అధిక ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి అవసరం మేరకే తినాలి. దీంతోపాటు నియమిత వ్యాయామాలు పాటించాలి. రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా, లేదా బరువులు ఎత్తడం వంటి ఎక్సర్‌సైజులు చేస్తే మంచిది. అలాగే కండరాల బలం కోసం వారానికి 2-3 సార్లు బరువు శిక్షణ లేదా రెసిస్టెన్స్ ఎక్సర్‌సైజ్‌లు చేయండి. యోగా, స్ట్రెచింగ్ వంటివి వృద్ధాప్యంలో కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
*స్ట్రెస్ మేనేజ్‌మెంట్ : మెడిటేషన్, డీప్ బ్రీత్ (deep breath), మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ వంటివి చేయడం, కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా దీర్ఘాయుష్షును పెంచుతాయి. సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి. అలాగే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ టైమ్ స్పెండ్ చేయడం మానసి ఆరోగ్యాన్ని మెరుగు పర్చడం ద్వారా ఆనందం, ఆరోగ్యం, దీర్ఘాయువు వంటివి సాధ్యమవుతాయి.
*నాణ్యమైన నిద్ర : రోజుకు 7-8 గంటల నాణ్యమైన నిద్ర శరీరం, మెదడు ఆరోగ్యానికి అవసరం. ముఖ్యంగా పడుకోవడం, లేవడం విషయంలో ఒకేసమయాన్ని అలవాటు చేసుకోండి. సరైన నిద్ర షెడ్యూల్, అలాగే నిద్ర వేళకు ఒకగంట ముందు మొబైల్, టీవీ వంటి స్క్రీన్ టైమ్ నివారించడం చేయాలి.
*హానికర అలవాట్ల నివారణ : పొగాకు లేదా ధూమపానం గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ఆయు క్షీణతకు దారితీస్తుంది. అలా కాకుండా మీ ఆయుష్షు పెరగాలంటే ధూమపానం తగ్గించాలి. అధిక మద్యపానం కూడా కాలేయం, గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి తగ్గించాలి.
*రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు : బ్లడ్ ప్రెజర్(blood pressure), రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, క్యాన్సర్ స్క్రీనింగ్‌లను క్రమం తప్పకుండా చేయించుకోండి. వయస్సుకు తగిన టీకాలు (ఉదాహరణఖు ఇన్ ఫ్లూ ఎంజా, న్యుమోనియా వంటివి తీసుకోవాలి.
*మెదడు ఆరోగ్యం : మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటేనే మీరు మరింత ఆనందగా, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి పజిల్స్, రీడింగ్, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వంటివి కూడా చేస్తూ ఉండండి. ఇవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. వీటితోపాటు మ్యూజిక్, పెయింటింగ్, లేదా రచన ఇలా ఏవైనా మీ మానసిక ఆనందాన్ని పెంపొందించే అభిరుచులను అలవర్చుకోండి. వీటన్నింటితోపాటు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, రోజువారీ వ్యాయామాలు కూడా మీ ఆయుష్షును పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.






