- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fitness : జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే..!
Fitness : జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే..!

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య పలువురు ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా డయాబెటిస్, కార్డియో వాస్క్యులర్ ఇష్యూస్, స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి మొదట్లోనే కంట్రోల్ చేయాలని నిపుణులు చెబుతుంటారు. దీంతో బాధితులు బరువు తగ్గాలనే ఉద్దేశంతో బలవంతంగా ఆకలిని చంపుకుంటూ తక్కువ తినడమో, పస్తులుండటమో చేస్తుంటారు. మరికొందరు జిమ్‌కు వెళ్లి కష్టపడుతుంటారు. అయితే ఇలాంటివి చేయకుండా కూడా అధిక బరువు తగ్గే మార్గం కూడా ఒకటి ఉందంటున్నారు నిపుణులు. అదే ‘వాల్యుమెట్రిక్ డైట్’.
కొద్ది మొత్తంలో తింటూనే..
వాల్యు మెట్రిక్ డైట్‌లో భాగంగా కొద్ది మొత్తంలో తింటూనే కడుపు నిండేలా తగిన విధంగా అంటే.. అధిక ప్రోటీన్స్, ఇతర పోషకాలు తీసుకుంటారు. ప్రోటీన్ లెవల్స్ అధికంగా ఉండి, తక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు, పండ్లు ఈ డైట్‌లో యూజ్ చేస్తారు. దీనివల్ల ఆకలిని కంట్రోల్ చేసుకోకుండా అవసరం అయినప్పుడల్లా కొద్ది మొత్తంలో తింటూ అధిక బరువును తగ్గించుకుంటారు. ఇలా కొంతకాలం ప్రయత్నించడంవల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఆహారాల్లో మార్పు
తాజా పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, మిల్లెట్స్ వంటివి వాల్యు మెట్రిక్ డైట్‌లో భాగంగా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే బరువు తగ్గేందుకు మొదట జంక్ ఫుడ్స్, హై కేలరీలు తగ్గించి వీటిని ఎక్కువ తీసుకోవాలి. కడుపు నిండే వరకు ఎన్ని పండ్లు అయినా తినవచ్చు. ఆ తర్వాత వాటిని జంక్ ఫుడ్, పండ్లను తగ్గిస్తూ మిల్లెట్స్ మొదలుపెట్టాలి. పండ్లను తగ్గించి మిల్లెట్స్‌ను మెయిన్ మీల్‌గా తీసుకోవాలి. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రొటీన్స్, హెల్దీ ఫ్యాట్స్‌ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆకలిని కంట్రోల్ చేయకుండా శరీరానికి క్రమంగా కేలరీలు తగ్గించడమే వాల్యు మెట్రిక్ డైట్ ప్రధాన ఉద్దేశం. దీనికోసం బరువు తగ్గడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. జిమ్‌కు వెళ్లి ఖర్చు చేసుకోవాల్సిన అవసరం కూడా తప్పుతుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






