Chai Biscuit : చాయ్ బిస్కెట్.. రోజూ తీసుకుంటే తప్పదు రిస్క్!

by Javid Pasha |

Chai Biscuit : చాయ్ బిస్కెట్.. రోజూ తీసుకుంటే తప్పదు రిస్క్!

Chai Biscuit : చాయ్ బిస్కెట్.. రోజూ తీసుకుంటే తప్పదు రిస్క్!
X

దిశ, ఫీచర్స్ : చాలామందికి ఉండే సాధారణ అలవాట్లలో చాయ్ బిస్కెట్ తీసుకోవడం కూడా ఒకటి. టీలో బిస్కెట్ ముంచుకొని తింటుంటే ఆ టేస్టే వేరబ్బా.. అంటుంటారు కూడా. కొందరు అన్నం తినకుండా అయినా ఉంటారేమో కానీ, టీలో బిస్కెట్ ముంచుకొని తినకుండా మాత్రం ఉండలేరు. ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది ఉదయం లేవగానే చాయ్ బిస్కెట్‌తో‌నే రోజును ప్రారంభిస్తారు. ఇక వివిధ పనుల్లో నిమగ్నమై ఉండేవారు బ్రేక్ సమయంలోనూ టీ బిస్కెట్ టేస్టును ఆస్వాదించాలని భావిస్తారు. కానీ డైలీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం మీకు తెలుసా?

చాయ్ బిస్కెట్ అలవాటు వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే చాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో హై కేలరీలు, హై షుగరింగ్, అన్‌హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. పైగా ఫైబర్ కంటెంట్ ఉండదు. కాబట్టి ప్రతి రోజూ టీలో ముంచుకొని తినడంవల్ల అధిక బరువు, రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికైతే చాయ్ బిస్కెస్ అధికంగా తీసుకోవడం ఆ సమస్యను మరింత పెంచవచ్చు. కొన్ని బిస్కెట్లలో సోడియం కంటెంట్ అధికంగా ఉండటంవల్ల ఇది దంతాలు, గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అజీర్తి, ఛాతీలో మంట, ఆకలి మందగించడం, మలబద్ధకం, రోగ నిరోధక శక్తి బలహీన పడటం వంటి సమస్యలకు దారితీస్తుంది.

Next Story