- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Overweight : డైట్ పాటిస్తున్నా అధిక బరువు తగ్గట్లేదా..? మీరు చేస్తున్న పొరపాట్లు ఇవే..!
Overweight : డైట్ పాటిస్తున్నా అధిక బరువు తగ్గట్లేదా..? మీరు చేస్తున్న పొరపాట్లు ఇవే..!

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు లేదా ఊబకాయం ఒకటి. మారుతున్న జీవనశైలి, భిన్నమైన ఆహారపు అలవాట్ల వల్ల కొందరు ఈజీగా వెయిట్ పెరుగుతున్నారు. తగ్గడానికి మాత్రం నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. పైగా ఇది అధిక రక్తపోటు, కీళ్లనొప్పులు, గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితానికి బరువు తగ్గడమే చక్కటి పరిష్కారంగా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కొందరు ఎంత ప్రయత్నించినా, సరైనా డైట్ పాటించినా బరువు తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కానీ కారణాలు వేరుగా ఉండవచ్చునని, మీకు తెలియకుండానే డైట్ విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుండవచ్చునని ఫిట్‌నెస్ అండ్ హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అవేమిటో చూద్దాం.
* డైట్ పాటిస్తున్నప్పటికీ బరువు తగ్గడం లేదంటే.. మీరు రాత్రి భోజనంలో అధిక కార్బొహైడ్రేట్లు తీసుకుంటూ ఉండవచ్చు. కానీ చాలా మంది ఈ విషయాన్ని గుర్తించరు. సాధారణ ఆహారమే తింటున్నాం కదా అనుకుంటారు. కానీ తినే ఆహారంలో అధిక చక్కర స్థాయిలు, అధిక కార్బొహైడ్రేట్లు ఉండి ఉంటాయి. ఇలాంటప్పుడు ఎన్ని వ్యాయామాలు చేసినా, ఏ విధమైన డైట్ పాటించినా పాటించినా ఫలితం ఉండదు అంటున్నారు నిపుణులు.
*ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలని కొందరు గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే మీ శరీర తత్వాన్ని బట్టి వ్యాయామం ఎంత సేపు చేయాలనే అవగాహన ఉండాలి. ఇది తెలుసుకొని పాటిస్తే మంచిది. అంతే తప్ప బరువు తగ్గాలని అధిక వ్యాయామాలు చేసినంత మాత్రాన తగ్గరని నిపుణులు చెబుతున్నారు. పైగా ఎక్కువసేపు వ్యాయామం చేయడంవల్ల మీ శరీర తత్వాన్ని బట్టి నష్టం జరగవచ్చు. దీనివల్ల కూడా మరింత బరువు పెరిగే చాన్స్ ఉంటుంది. అధిక ఒత్తిడి కూడా వెయిట్‌లాస్ అవ్వకుండా అడ్డుపడుతుంది.
*రాత్రిపూట ఆలస్యంగా తినేవారు కూడా, ఎంత బాగా డైట్ పాటించినా, వ్యాయామం చేసినా అధిక బరువు తగ్గే చాన్స్ ఉండదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి దినచర్య కలిగి ఉండి, ఉదయంపూట వ్యాయామాలు చేసినా ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి రాత్రిళ్లు మరీ ఆలస్యంగా తినవద్దు. అలాగే నాణ్యమైన నిద్ర, రోజు మొత్తంలో సమయానికి తినడం, అవసరం మేరకు మాత్రమే వ్యాయామాలు చేయడం వంటివి మీ దిన చర్యలో భాగమైతే ఊబకాయం లేదా అధిక బరువు సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ మెట్లు ఎక్కి దిగడం, తిన్న తర్వాత కాసేపు వాకింగ్ వంటివి కూడా బరువు తగ్గడంలో సహాయపడతాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






