- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిలేషన్‌షిప్ జర్నీ.. ఎన్ని మలుపులో తెలుసా?
రిలేషన్‌షిప్ జర్నీ అనేది పలు అంశాలపై ఆధారపడి ఉండటమే కాదు, అది పలు దశలు(phases)గానూ వ్యక్తం అవుతుందని నిపుణులు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : సంబంధాలు ముడివడగానే సరిపోదు. పదికాలాల పాటు సంతోషంగా వర్ధిల్లాలంటే పరస్పరం అర్థం చేసుకోవడం, అవగాహనతో మసలుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రతీ ఒక్కరి జీవితంలో ఈ రిలేషన్‌షిప్ జర్నీ అనేది పలు అంశాలపై ఆధారపడి ఉండటమే కాదు, అది పలు దశలు(phases)గానూ వ్యక్తం అవుతాయని నిపుణులు అంటున్నారు. ప్రతీ దశలో ప్రేమతోపాటు భిన్నమైన అనుభవాలు ఎదురవుతుంటాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ దశలేమిటి? బంధాన్ని ఎలా మలుపు తిప్పుతాయో చూద్దాం.
1. డ్రీమ్ ఫేజ్
డ్రీమ్ ఫేజ్(Dream Phase)లో సంబంధం ఎంతో అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. ఒక విధమైన మాయాజాలంలా తోస్తుంది. లవ్ అంటేనే అందమైన అనుభూతిగా, పరిపూర్ణంగా అనిపిస్తుంది. అప్రయత్నంగానే లభించిన భావన కలుగుతుంది. దీంతో భాగస్వాములు ఒకరి లోపాలను ఒకరు పెద్దగా గమనించడం కానీ, పట్టించుకోవడం కానీ చేయరు. పరస్పర ఆకర్షణలో మునిగిపోతారు. భార్య భర్తల మధ్య లేదా ప్రతీది సానుకూలంగా, ఉత్తేజకరంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆశాజనక ఊహలు ఉంటాయి. అయితే ఈ ఫేజ్ కేవలం టెంపరరీ మాత్రమే. ఎందుకంటే వాస్తవికత ఇంకా ఎదురు కాలేదు.
2. డిస్కవరీ ఫేజ్
ఆవిష్కరణ దశ(Discovery Phase)లో పార్ట్‌నర్స్ ఒకరి గురించి ఒకరు లోతుగా తెలుసుకుంటారు. వ్యక్తిగత అలవాట్లు, లోపాలు, విభిన్న ఆలోచనలు బయటపడతాయి. ప్రారంభ ఆకర్షణ( initial attraction ) కొంత తగ్గవచ్చు. కానీ సంబంధం ఇంకా బలంగా ఉంటుంది. ఈ దశలో సామరస్యం కొనసాగించడానికి ఓపెన్ కమ్యూనికేషన్ ముఖ్యం అంటున్నారు నిపుణులు.
3. డిస్పప్పాయింట్ ఫేజ్
నిరాశ దశ(Disappointment Phase)లో రిలేషన్‌షిప్ పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. జంటల మధ్య ఆర్గ్యుమెంట్స్, మిస్ అండర్‌స్టాండ్ చేసుకోవడం, అపార్థాలు, లేదా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. భాగస్వాముల మధ్య పరస్పరం లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది నిరాశకు దారితీస్తుంది. అయితే ఈ ఫేజ్ ప్రేమ బలాన్ని పరీక్షిస్తుంది. సంబంధం కొనసాగాలా లేక విడిపోవాలా అనేది భాగస్వాములు తేల్చుకునేది ఈ దశలోనే.
4. రీ బిల్డింగ్ ఫేజ్
జంటలు సవాళ్లను అధిగమించి, సంబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసేదే పునర్నిర్మాణ దశ (Rebuilding Phase). హెల్తీ బౌండరీస్ సెట్ చేసుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఉద్దేశపూర్వకంగా ప్రేమను ఎంచుకోవడం ఈ దశలో కనిపిస్తాయి. ముఖ్యంగా సారీ చెప్పుకోవడం, కాంప్రమైజ్ అవడం, నమ్మకాన్ని ఏర్పర్చుకోవడం వంటివి రీబిల్డ్ అయ్యేది ఈ దశలోనే.
5. కొనసాగింపు దశ
జంటల మధ్య ప్రేమ లోతైన, శాశ్వత బంధంగా మారే దశను వారసత్వ దశ(Legacy Phase)గా పేర్కొంటారు. శాంతి, ఎగ్జాయిట్మెంట్, అచంచల సహవాసం(Unwavering companionship) సంబంధాన్ని నిర్వచిస్తాయి. ఈ దశలో జంటలు తమ ప్రేమతో ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. సామాజికంగా శాశ్వతమైన ప్రభావాన్ని క్రియేట్ చేస్తారు. ఇది కేవలం భావోద్వేగాలకు మాత్రమే పరిమితం కాకుండా.. కొనసాగుతూ ఉంటుంది. Link






