- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sleep apnea : నిద్ర వేళలో ఆ సమస్య.. శృంగార జీవితంపైనా ప్రభావం!
Sleep apnea : నిద్ర వేళలో ఆ సమస్య.. శృంగార జీవితంపైనా ప్రభావం!

దిశ, ఫీచర్స్ : ఓ వైపు బిజీ లైఫ్ షెడ్యూల్, మరోవైపు నిరంతరం ఒత్తిడికి గురికావడం వంటి జీవనశైలి మార్పులు మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఇటీవల చాలా మందిలో స్లీప్ డిజార్డర్స్ పెరిగిపోతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు గట్టిగా గురకపెట్టే రుగ్మత, అంటే స్లీప్ అప్నియా ప్రస్తుతం అనేక మందిని వేధిస్తోంది. చివరికి ఇది రిలేషన్‌షిప్స్‌పై కూడా ప్రభావం చూపుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.
శ్వాసలో ఇబ్బంది
ఒక వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు తనకు తెలియకుండానే పెద్ద శబ్దంతో గురకపెట్టడాన్నే ఆరోగ్య నిపుణులు అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ) అని పిలుస్తున్నారు. దీని బారిన పడిన వారిలో రాత్రిళ్లు నిద్రలో ఉండగా సడెన్‌గా క్షణం పాటు శ్వాస ఆగిపోవడం, మళ్లీ తీసుకోవడం చేస్తుంటారు. ఈ సందర్భంగా బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్స్ హెచ్చు తగ్గులకు గురవుతుంటాయని, అందుకు ఫలితంగా గురక శబ్దం వస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
లక్షణాలు
స్లీప్ అప్నియా ప్రధాన క్షణాల్లో బిగ్గరగా గురకపెట్టడం ఒకటి. ఈ సందర్భంలో ఒక్కసారిగా శ్వాస ప్రక్రియలో మార్పు రావడంతో బాధిత వ్యక్తులు ఉక్కిరి బిక్కిరి అవుతారు. శబ్దాలు చేయడం, ఉలిక్కి పడి మేల్కోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా పెద్ద పెద్ద శబ్దాలవల్ల బాధితుల చుట్టు పక్కల ఉన్న వ్యక్తులకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా గురక బాధిత వ్యక్తికే కాకుండా జీవిత భాగస్వామిని కూడా ప్రభావితం చేస్తుంది. పెద్ద శబ్దాలతో గురక పెట్టడం వల్ల నిద్రకు ఆటకం కలుగుతుంది. క్రమంగా ఇది నిద్రలేమికి దారితీస్తుంది. అలాగే శృంగార లేదా లైంగిక జీవితంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.
పర్యవసనాలు
స్లీప్ అప్నియా దీర్ఘకాలం కొనసాగితే మెంటల్ డిజార్డర్స్, లిబిడో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్ 60 శాతం, కరోనరీ హార్ట్ డిసీజెస్ రిస్క్ 30 శాతం పెరుగుతుందని గత అధ్యయనాలు సైతం పేర్కొన్నాయి. అందుకే స్లీప్ అప్నియాకు తగిన చికిత్స తీసుకోవాలని శ్వాసకోశ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక జీవన శైలి మార్పులకు సంబంధించి అధిక బరువు తగ్గడం, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లను మానుకోవడం, హెల్తీ డైట్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ వంటివి కలిగి ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






