- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : హైపర్ టెన్షన్.. యువతలోనూ పెరుగుతోందిగా..!
జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఒబేసిటీ, అధిక ఉప్పు, ఆల్కహాల్, స్మోకింగ్, స్ట్రెస్ వంటివి ప్రైమరీ హైపర్ టెన్షన్‌కు కారణం అవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు!

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఏజ్‌బార్ అయినవారిలోనే హైబ్లడ్ ప్రెజర్ (హైజర్ టెన్షన్) సమస్య ఎక్కువగా కనిపించేది. కానీ ఇటీవల వయసుతో సంబంధం లేకుండా యువతలోనూ ఇది కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు ఇందుకు కారణం అవుతున్నాయని పేర్కొంటున్నారు. డబ్ల్యుహెచ్‌ఓ ప్రకారం.. 30 -79 ఏళ్ల వయసులో సుమారు 33% మందికి హైపర్ టెన్షన్ సమస్య ఉంటున్నది. ఇండియాలో 40+ ఏళ్ల వయసుగల వారిలోనూ ఇది (మహిళల్లో 63.66%, పురుషుల్లో 74.79%) పెరుగుతున్నదని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ అధిక రక్తపోటు సమస్య ఎందుకు వస్తుంది? రాకుండా ఏం చేయాలి? హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
ఎందుకు వస్తుంది?
హై బ్లడ్ ప్రెజర్ అనేది ప్రైమరీ (Essential), సెకండరీ (Secondary) అని రెండు రకాలుగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రైమరీ హైపర్ టెన్షన్ సాధారంగా జెనెటిక్ ఫ్యాక్టర్స్, వయసు పెరగడం, ఒబేసిటీ, అధిక ఉప్పు తీసుకోవడం, ఆల్కహాల్ వినియోగం, స్మోకింగ్, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, అధిక ఒత్తిడి వంటి కారణాలవల్ల వస్తుందని పేర్కొంటున్నారు. ఇక సెకండరీ హైపర్ టెన్షన్ కిడ్నీ వ్యాధులు, ఎండోక్రైన్ డిజార్డర్స్, మెడికేషన్స్ లేదా ఆర్టరీ నారోయింగ్ వంటి అండర్ లైయింగ్ (underlying) కండిషన్స్ వల్ల ఏర్పడుతుంది. ఇది హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ రిస్క్‌ను కూడా పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
నివారణ ఎలా?
అధిక రక్తపోటు సమస్యను నివారించడానికి హెల్తీ లైఫ్ స్టైల్ అవలంభించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజువారీ డైట్‌లో ఉప్పును తగ్గించాలని, 5 గ్రాములకు మించకూడదని సూచిస్తున్నారు. ఇక పండ్లు, కూరగాయలు, లో-ఫ్యాట్ డెయిరీ ప్రొడక్ట్స్ ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే బరువు నియంత్రణ చాలా ముఖ్యం. వారానికి కనీసం 150 నిమిషాలు వాకింగ్, స్విమ్మింగ్ వంటి మోడరేట్ ఎక్సర్‌సైజ్ ఉండేలా చూసుకోవాలని, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి మానేయాలని ఆరోగ్య నిపుణుల సలహా. దీంతోపాటు ఒత్తిడి నిర్వహణ కోసం యోగా, మెడిటేషన్, 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర వంటివి అవసరమని కూడా చెబుతున్నారు. అలాగే హైబీపీ సమస్య ఉన్నవారు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు పాటించాలని సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






