మెదడు సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే కావాల్సింది ఇవే..

by Javid Pasha |

వాస్తవానికి ఆకలి నియంత్రణ, శరీరంలోని వివిధ జీవక్రియలకు సంబంధించిన 90 శాతం సెరోటోనిన్ హార్మోన్ పేగుల్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాలవల్లే ఇది సాధ్యమౌతుంది.

మెదడు సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే కావాల్సింది ఇవే..
X

దిశ, ఫీచర్స్ : మనం ఏ పని చేయాలన్నా ముందు ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా ఉండాలంటారు నిపుణులు. శరీర భాగాలతోపాటు మెదడు సామర్థ్యం చాలా ముఖ్యమని, అప్పుడే రోజంతా యాక్టివ్‌గా ఉండగలమని, సమర్థవంతంగా పనిచేయగమని చెబుతుంటారు. అయితే అందుకోసం కొన్ని రకాల ఆహారాలు తప్పక తీసుకోవాలని సూచిస్తుంటారు. ఎందుకంటే ఆహార నాళానికి, మెదడుకు మధ్య అనుసంధాన వ్యస్థ ఉంటుంది. కాబట్టి మెదడుకు మేలు ఆహార పదార్థాలు అందుకు దోహదం చేస్తాయని అమెరికాలోని హర్వర్డ్ మెడికల్ కాలేజ్‌కు చెందిన న్యూట్రీషనల్ సైకియాట్రిస్టుల అధ్యయనం పేర్కొన్నది. పైగా మెదడు, పేగులు ఒకే ఎంబ్రియానిక్ కణాల నుంచి తయారవడం కూడా ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. వీటిమధ్య సమాచార మార్పిడి కొన్ని రసాయనిక చర్యలపై ఆధారపడి జరుగడంవల్ల ఇక్కడ ఆహారాలు కీలకపాత్ర పోషిస్తాయి.

*వాస్తవానికి ఆకలి నియంత్రణ, శరీరంలోని వివిధ జీవక్రియలకు సంబంధించిన 90 శాతం సెరోటోనిన్ హార్మోన్ పేగుల్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాలవల్లే ఇది సాధ్యమౌతుంది. కాబట్టి హెల్తీ ఫుడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు నిపుణులు. ఒకవేళ ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోతే పేగుల్లో మంటతోపాటు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే మెదడు సామర్థ్యం పెరగాలంటే.. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ఆహారపు అలవాట్లు కలిగి ఉండాల్సిందే.

*ముఖ్యంగా విటమిన్ బి, బి-12, బి-9, బి-1 ఇందుకు దోహదం చేస్తాయి. ఆకు కూరలు, గ్రీన్ కలర్ ఉండే దాదాపు అన్ని రకాల కూరగయాల్లో ఇవి లభిస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు పసుపు, కుంకుమ పువ్వు, వివిధ సుంగధ ద్రవ్యాలు కూడా తరచుగా ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లకు మూలం కాబట్టి, వాల్ నట్స్, డార్క్ చాక్లెట్ కూడా మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తి పెంచుతాయి. అలాగే అవకాడో, తృణ ధాన్యాలు, పచ్చి బఠానీలు, చిక్కుళ్లు, ఆకు కూరలు, పాలు, పెరుగు వంటి ఆహారాలు కూడా మెదడు సామర్థ్యాన్ని, జ్ఞాపక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story