- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న హాబిట్స్.. వీటికి దూరంగా ఉంటేనే బెటర్!
తలనొప్పి రాకున్నా వస్తుందేమో అనే అనుమానంతో ట్యాబ్లెట్ వేసుకునేవారు సైతం అక్కడక్కడా కనిపిస్తుంటారు. కానీ ఇది ప్రమాదం!

దిశ, ఫీచర్స్ : మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. ఇది జీర్ణక్రియ, బాడీ డిటాక్సిఫికేషన్, ఎనర్జీ నిర్వహణలో కీ రోల్ పోషిస్తుంది. అయితే ఇటీవల యువతలో, పెద్దల్లో పెరిగిపోతున్న కొన్ని రోజువారీ అలవాట్లు కాలేయాన్ని ప్రమాదంలో పడేస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేమిటి? లివర్ హెల్త్‌ను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
*అధిక మద్యపానం : ఒకప్పుడు పెద్దలు మాత్రమే మద్యపానం సేవించేవారు. అది కూడా లిమిటెడ్‌గా ఉండేది. కానీ ఇటీవల 18 ఏండ్ల పైబడిన యువతలోనూ ఈ అలవాట్లు కనిపిస్తున్నాయి. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా అనేకమంది దానికి అడిక్ట్ అవుతున్నారు. ఈ పరిస్థితులే కాలేయ ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేస్తున్నాయి. ముఖ్యంగా డైలీ లేదా వారంలో మూడుసార్లు ఆల్కహాల్ తీసుకునే అలవాటు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులుఅ అంటున్నారు. తద్వారా ఫ్యాటీ లివర్, హెపటైటిస్, లివర్ సిర్రోసిస్ వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని చెబుతున్నారు.
*అన్‌హెల్తీ ఫుడ్స్ : అధిక కొవ్వు, అధిక చక్కెరలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వంటివి తీసుకోవడం వల్ల నాన్ - ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వస్తుంది.
*మెడిసిన్ దుర్వినియోగం : కొందరు ప్రతీ చిన్న సమస్యకు కంగారు పడిపోయి ట్యాబ్లెట్స్, టానిక్స్ వాడేస్తుంటారు. తలనొప్పి రాకున్నా వస్తుందేమో అనే అనుమానంతో ముందుగానే ట్యాబ్లెట్ వేసుకునేవారు సైతం ఉంటున్నారు. కానీ ఇది అలవాటుగా మారితే మీ కాలేయాన్ని దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డాక్టర్ సలహాల లేకుండా పెయిన్‌కిల్లర్స్ (కనీసం పారాసెటమాల్ వంటివి కూడా) లేదా ఇతర ఏ విధమై ఔషధాలను కూడా అధికంగా వాడకూడదని సూచిస్తున్నారు. వాడితే మాత్రం కాలేయం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
*ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం : దీర్ఘకాలంపాటు కదలికలేని జీవనశైలిని కలిగి ఉండటం లేదా శారీరక శ్రమకు దూరంగా ఉండటం కూడా ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది ఊబకాయం, అధిక బరువుతో పాటు ఫ్యాటీ లివర్ వంటి ప్రాబ్లమ్స్‌కు దారితీస్తుంది. అట్లనే సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్ కూడా ఎక్కువగా ఉపయోగించకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే ఫ్రక్టోజ్ వంటివి కాలేయంలో కొవ్వును పెంచుతాయి.
*ధూమపానం : ధూమపానం కాలేయంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతుంది. దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది. దీర్ఘకాలంపాటు సరైన విశ్రాంతి లేకపోవడం కూడా కాలేయాన్ని దెబ్బతీస్తుంది.
కాలేయం రిస్క్‌లో ఉందని సూచించే లక్షణాలు
*ప్రతిరోజూ అధిక అలసట, శారీరక బలహీనత
* కామెర్లు (Jaundice): చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం (బిలిరుబిన్ పెరగడం వల్ల ఇలా జరుగుతంది).
*కడుపు నొప్పి: కుడి పక్కటెముక కింద భాగంలో తరచుగా నొప్పి లేదా అసౌకర్యం
*జీర్ణ సమస్యలు: వికారం, వాంతులు, ఆకలి తగ్గడం, లేదా జీర్ణక్రియ సమస్యలు అధికం కావడం
*మూత్రం, మలం రంగులో మార్పు: మూత్రం గాఢమైన పసుపు రంగులో, మలం లేత రంగులో ఉండటం.
*వాపు : కాళ్లు చీలమండలు, లేదా కడుపులో వాపు (Ascites)
*చర్మ సమస్యలు: చర్మంపై దురద, గీతలు లేదా స్పైడర్ వంటి రక్తనాళాలు కనిపించడం.
*అసాధారణ బరువు : ఊహించని విధంగా బరువు తగ్గడం లేదా పెరగడం.
*మానసిక గందరగోళం : తీవ్రమైన సందర్భాల్లో, హెపటిక్ ఎన్సెఫలోపతి వల్ల గందరగోళం లేదా జ్ఞాపకశక్తి సమస్యలు తలెల్తుతాయి.
ఏం చేయాలి?
*కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ (మాంసం, చేపలు, గింజలు) వంటివి తీసుకోవాలి
*చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తగ్గించాలి
*గ్రీన్ టీ, బీట్‌రూట్, పసుపు, వెల్లుల్లి వంటివి కాలేయ ఆరోగ్యానికి మంచివి.
*ఆల్కహాల్ ను పూర్తిగా మానేయడం లేదా చాలా తక్కువగా తీసుకోవడం చేయాలి
*రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, యోగా, లేదా ఇతర వ్యాయామాలు ఏవైనా చేయడం ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తాయి.
*డాక్టర్ సలహాలు లేకుండా ప్రతీ చిన్న సమస్యకు సొంతంగా ఔషధాలు వాడకూడదు. అలాగే అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి. రెగ్యులర్ హెల్త్ చెకప్‌ల ద్వారా లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.






