పొద్దు పొద్దున్న మూడ్ ఖరాబ్..! ఈ ఫీలింగ్‌కి కారణమేంటో తెలుసా?

by Javid Pasha |

నిద్రకు ముందు మీరు తీసుకునే ఆహారాలు, పానీయాలు, అతి ఆలోచనలు మీ మానసిక స్థితిలో మార్పునకు దారితీస్తాయి. మరుసటిరోజు ఉదయం బ్యాడ్ మూడ్‌తో నిద్ర మేల్కొనేలా చేస్తాయి.

పొద్దు పొద్దున్న మూడ్ ఖరాబ్..! ఈ ఫీలింగ్‌కి కారణమేంటో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : పొద్దు పొద్దున్న మూడ్ ఖరాబైంది. ఈ రోజెందుకో అస్సలేం బాలేదు అంటుంటారు కొందరు. నిరాశా నిస్పృహలతో, ఏదో తెలియని ఆందోళనతో నిద్ర మేల్కొంటారు. దీంతో ఆ రోజంతా మూడ్ ఆఫ్ అయిపోతారు! నిద్రవగానే ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తారు మరి కొందరు. ఆ రోజంతా యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. ఎందుకలా? అంటే.. ముందు రోజు రాత్రి మీరు చేసే పొరపాట్లు కూడా అందుకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నిద్రకు ముందు మీరు తీసుకునే ఆహారాలు, పానీయాలు, అతి ఆలోచనలు మీ మానసిక స్థితిలో మార్పునకు దారితీస్తాయి. మరుసటిరోజు ఉదయం బ్యాడ్ మూడ్‌తో నిద్ర మేల్కొనేలా చేస్తాయి. దీంతో స్ట్రెస్, యాంగ్జైటీ, కోపం వంటివి పెరుగుతాయి. ఎందుకిలా జరుగుతుంది? ఈ పరిస్థి నుంచి బయటపడేదెలా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

రాత్రి భోజనంలో పొరపాట్లు

చాలా మంది రాత్రి భోజనం చాలా టేటుగా తింటుంటారు. అలాగే తీసుకునే రాత్రి భోజనం, ఆహార పదార్థాలు సరైనవి కాకుంటే కూడా మరుసటి రోజు ఉదయం బ్యాడ్‌ మూడ్‌తో నిద్రమేల్కొనే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కొందరికైతే రాత్రి భోజనం తర్వాత స్వీట్లు, చిప్స్, స్పైసీ స్నాక్స్ వంటి చిరుతిళ్లు తినే అలవాటు ఉంటుంది. వీటిలో కార్బొహైడ్రేట్లు అధిక మోతాదులో ఉంటాయి కాబట్టి మరుసటిరోజు మీ మూడ్ పాడు చేస్తాయి. కోపంతోనో, చిరాకుతోనో, బద్ధకంతోనో మేల్కొనేలా చేస్తాయని న్యూట్రిషనల్ థెరపిస్ట్‌లు అంటున్నారు. కాబట్టి నిద్ర పోయేకంటే రెండు గంటలు, కనీసం గంట ముందే హెల్తీ ఫుడ్స్ తినాలని నిపుణులు సూచిస్తు్న్నారు.

విటమిన్లు, మెగ్నీషియం లోపం

మీ దిన చర్య ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి తగిన మెగ్నీషయం, పలు ఇతర విటమిన్లు అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి. తినే ఆహారంలో అవి దీర్ఘకాలంపాటు లోపించడం మానసిక స్థితిలో మార్పునకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఉదయం లేవగానే బ్యాడ్ మూడ్‌కి కారణం అవుతుంది. అందుకే మీ డిన్నర్‌‌లో ముదురు రంగు కూరగాయలు, ఆకుకూరలు వంటివి ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మెగ్నీషియం తగిన సాంద్రతలో మెయింటెన్ చేయడానికి ఇవి చాలా అవసరమని చెబుతున్నారు.

ఆల్కహాల్ అధికమైతే..

బీరు మితంగా తీసుకుంటే మంచిదని చెప్తారు. కానీ ఆల్కహాల్ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. తరచుగా మద్యం తాగితే కాలేయం, మూత్ర పిండాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాకుండా నిద్రకు ముందు మద్యం సేవించడం మరుసటిరోజు నిద్ర మేల్కొనే తీరుపై ఎఫెక్ట్ చూపుతుంది. రోజంతా డల్‌గా ఉంటారు. అట్లనే టూ మచ్ ఆల్కహాల్ లివర్‌పై ఒత్తిడిని పెంచి అనారోగ్యానికి దారితీస్తుంది. ఊహించని రీతోలో మానసిక ఆందోళనను, భావోద్వేగాలను పెంచుతుంది. కాబట్టి మద్యం సేవించడం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీంతోపాటు తరచుగా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం కూడా మీ మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Next Story