- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మానసిక ఒత్తిడితో స్కిన్ ప్రాబ్లమ్స్.. మొహంపై మొటిమలు కూడా అందుకే వస్తాయా?
దిశ, ఫీచర్స్ : బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా అనేకమంది మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందన్న విషయం మనకు తెలిసిందే. కానీ స్ట్రెస్, యాంగ్జైటీస్ స్కిన్ ప్రాబ్లమ్స్‌కు కూడా దారితీస్తాయని ఇటీవల పరిశీలనలు వెల్లడిస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మొహంపై మొటిమలు రావడానికి, మానసిక ఒత్తిడికి మధ్య కూడా లింక్ ఉందని చెప్తు్న్నారు.
అధిక ఒత్తిడివల్ల శరీరంలో ఆండ్రోజెన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. వీటి కారణంగా జరిగే రసాయన చర్యలు పలు మార్పులకు కారణం అవుతాయి. ముఖ్యంగా రాత్రిపూట ఆందోళన మరింత పెరుగుతుంది. ఇది నిద్రలేమి, జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఫలితంగా ప్రతికూల రసాయనిక చర్యలు చర్మంపై ప్రభావం చూపుతాయి. దీంతో మచ్చలు ఏర్పడటం, తరచుగా దురద రావడం, స్కిన్ డర్టీగా మారడం వంటి ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు. అంతేకాకుండా మొహంపై మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలతో ఏర్పడతాయి. అయితే యోగా, ధ్యానం, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ వంటి వంటి స్ట్రెస్ రిలీఫ్ వ్యాయామాలు, సరిపడా నీరు తాగడం, ఫిజికల్ యాక్టివిటీస్ వంటివి ఈ సమస్య నుంచి బయటపడటంలో సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు.
Read More..
వెడ్డింగ్ కార్డులో మోడీ పేరు.. చిక్కుల్లో పడ్డ పెళ్లి కొడుకు.. అసలు ఏం జరిగిందంటే..