ఫిట్‌నెస్ పెంచుకోవాలా? అయితే.. Rucking చేయండి!

by Javid Pasha |

రకింగ్ చేయడం మీ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుందని, ఫిట్‌నెస్‌ను పెంచుతుందని నిపుణులు అంటున్నారు.

ఫిట్‌నెస్ పెంచుకోవాలా? అయితే.. Rucking చేయండి!
X

దిశ, ఫీచర్స్ : మీరు హెల్తీగా, ఫిట్‌నెస్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే రకింగ్(Rucking) ట్రై చేయండి అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఇది సాధారణ నడకను మరింత శక్తివంతమైన వ్యాయామంగా మార్చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇది కార్డియో ప్రయోజనాలను వాకింగ్ ద్వారా, బలం (Strength) ప్రయోజనాలను రెసిస్టెన్స్ ట్రైనింగ్ ద్వారా ఒకేసారి ఇస్తుంది. ఇంతకీ ఇదెలా చేస్తారు? బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రకింగ్ అంటే.. వీపున బరువు మోస్తూ నడవడం లేదా హైకింగ్ చేయడం. ఇది సాధారణ వాకింగ్‌కు మించిన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని, ఫిట్‌నెస్‌ను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. బ్యాక్‌ప్యాక్‌లో బరువు మోస్తూ నడిస్తే కాళ్లు, కోర్, వీపు, భుజాలు మామూలు నడకకంటే ఎక్కువ పనిచేస్తాయి. బరువు మోసుకుంటూ నడిస్తే కాళ్లు, కోర్, వీపు, భుజాలు మామూలు నడక కంటే ఎక్కువ పని చేస్తాయి. ఇది సహనాన్ని, కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను, ముఖ్యంగా కండరాల బలాన్ని పెంచుతుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. రన్నింగ్ లాంటి హై- ఇంపాక్ట్ వ్యాయామాలతో పోలిస్తే.. రకింగ్ జాయింట్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. మోడరేట్ బరువు మోస్తే నడకతీరు, బ్యాలెన్స్ మెరుగుపడటంతోపాటు ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి రోజువారీ దినచర్యగా దీనిని పాటించవచ్చు. మార్నింగ్ వాక్, హైకింగ్ లేదా స్ట్రక్చర్డ్ ఫిట్‌నెస్ ప్లాన్‌లో భాగంగానూ చేసుకోవచ్చు. అయితే బిగెన్నర్స్ మాత్రం తమ బరువులో 5-10% మాత్రమే బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకొని ప్రారంభించాలి. క్రమంగా పెంచుకోవచ్చు.

ప్రయోజనాలు

*ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి: రకింగ్ వల్ల సాధారణ నడక కంటే 2-3 రెట్లు ఎక్కువ క్యాలరీలు కాలుతాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కార్డియో + స్ట్రెంగ్త్ రెండూ ఒకేసారి చేసిన ఫలితం దక్కుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, కాళ్లు, నడుము, వీపు, భుజాల కండరాలు బలపడతాయి. అంతేకాకుండా రన్నింగ్‌తో పోలిస్తే చీలమండలపై తక్కువ ఒత్తిడి ఉంటుంది.

*ఎముకల బలం (Bone Density) పెరుగుతుంది: ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ నివారణలో సహాయపడుతుంది. నడకలో స్థిరత్వం ఏర్పడుతుంది. శరీర సమతుల్యత పెరుగుతుంది. కండరాలు పెరగడం వల్ల రెస్ట్‌లో కూడా ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. బయటకు వెళ్లి నడవడంవల్ల స్ట్రెస్, యాంగ్జైటీస్ తగ్గి మానసిక ఆరోగ్య మెరుగు పడుతుంది. ఫంక్షనల్ ఫిట్‌నెస్ పెరిగి బరువులు మోయడం, మెట్లు ఎక్కడం వంటి రోజువారీ పనులు సులభంగా చేయగలుగుతారు.

జాగ్రత్తలు

బ్యాక్ పెయిన్, మోకాలి సమస్యలు, ఆస్టియోపొరోసిస్ లేదా గాయాలు ఉన్నవారు రకింగ్ (Rucking) ప్రారంభించేముందు డాక్టర్ సలహా తీసుకోవడం బెటర్. అలాగే బరువు ఎక్కువగా పెట్టుకుంటే కూడా మెడ, భుజాలు, వీపు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్యాక్‌ప్యాక్ కంఫర్ట్‌గా, బరువు ఎగువ వీపున ఉండేలా పెట్టుకోవాలి. వాకింగ్ సమయంలో నిటారుగా ముందుకు వంగకూడదు. నిజానికి రకింగ్ అంటే మరీ ఎక్కువ బరువును మోయడం కాదు. సాధారణ నడకతో స్థిరమైన రెసిస్టెన్స్‌ను కలిపి శరీరాన్ని నెమ్మదిగా, సురక్షితంగా బలోపేతం చేసే గొప్ప వ్యాయామం. సరైన విధంగా చేస్తే మొత్తం ఫిట్‌నెస్ రొటీన్‌కు బాగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story